కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఈ పాఠశాల్లో నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసింది. వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయితే మళ్లీ అదే క్లాస్ చదవాలని కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాహక్కు చట్టాన్ని 2019లో సవరణ చేశారు. దీని ప్రకారం మొత్తం 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఈ 5, 8వ తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి. నో డిటెన్షన్ పాలసీని రద్దు చేస్తూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పెద్ద నిర్ణయం తీసుకుంది5, 8 తరగతుల వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ రెండు నెలల్లోపు పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది, కానీ వారు మళ్లీ ఫెయిల్ అయితే, వారికి ప్రమోషన్ ఉండదు. పాఠశాల 8వ తరగతి వరకు… pic.twitter.com/ZIr1ySZWGr — RTV (@RTVnewsnetwork) December 23, 2024 ఇది కూడా చూడండి: Baby Bump: పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్.. చైనాలో కొత్త ట్రెండ్ ఫెయిల్ అయిన విద్యార్థులను బహిష్కరించడం ఉండదు ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను బహిష్కరించడం ఉండదు. ఫెయిల్ అయితే.. ఫలితాలు విడుదలకు రెండు నెలల ముందే మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ కూడా ఫెయిల్ అయితే మళ్లీ అదే క్లాస్‌లో చదవాల్సి ఉంటుంది. అయితే పాఠశాల విద్య పూర్తయ్యే వరకు ఏ విద్యార్థిని బహిష్కరించకూడదని కేంద్రం తెలిపింది. ఇది రూల్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న 3 వేల కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు మాత్రమే వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఇది కూడా చూడండి: YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే! ఈ నో డిటెన్షన్ పాలసీని కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. కానీ హరియాణ, పుదుచ్చేరి మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. నో డిటెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నో డిటెన్షన్ విధానమే ఇంకా కొనసాగుతుంది. ఇది కూడా చూడండి: Food Allergy: ఫుడ్ అలర్జీ డేంజర్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! ఇది కూడా చూడండి: GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్!