బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదరుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంగళూరు ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేట్‌రంగ కర్ణాటక బ్యాంక్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Also Read: చెత్తతో నిండిపోయిన భూకక్ష్య..ప్రమాదంలో ఉన్నామంటున్న ఐరాస
పూర్తి వివరాలు
అర్హత: డిగ్రీ లేదా పీజీ డిగ్రీ లేదా లా డిగ్రీ లేదా సీఏ/సీఎస్/సీఎంఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయోపరిమితి: 01-11-2024 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వరకు వయోసడలింపు ఉంది.
Also Read: టీడీపీ గూటికి ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి..!
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, మంగళూరు, న్యూఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, పుణే, కోల్‌కతా, ధర్వాడ్/హుబ్లీ, మైసూరు, శివమొగ్గ, కలబుర్గీలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Also Read: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్
జీతం: నెలకు రూ. 48,480 నుంచి రూ.1,17,000 వరకు జీతం ఇవ్వనున్నారు.
సర్వీసు బాండ్: ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కంపెనీలో కనీసం 3 ఏళ్ల పాటు పనిచేసేందుకు సర్వీసు బాండ్ సమర్పించాలి. అదే సమయంలో విఫలమైనవారు అపాయింట్‌మెంట్ లెటర్‌లో సూచించిన విధంగా లిక్విడేటెడ్ నష్టాలను చెల్లించాలి.
Also Read: ఏపీలో 280 పోస్టులకు నోటిఫికేషన్..
దరఖాస్తుకు చివరితేది: ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నవంబరు 30న ప్రారంభంకాగా.. డిసెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
రాతపరీక్ష తేదీ: 22-12-2024న ఉంటుంది.
పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్‌ను సంప్రదించండి.