జేఈఈ మెయిన్‌లో ర్యాంకింగ్ విషయంలో జాతీయ పరీక్షల సంస్థ కీలక మార్పులు చేసింది. ఇద్దరు విద్యార్థులకు ఒకే స్కోర్ వస్తే.. వారికి ర్యాంక్ కేటాయించేందుకు కొన్ని కొలమానాలు ఉంటాయి. అవి గతంలో తొమ్మిది ఉండగా.. ఈసారి వాటిని ఏడింటికి తగ్గించింది. ఈ ఏడు కొలమానాలు తర్వాత కూడా ఇద్దరి స్కోర్ సమానంగా ఉంటే ఒకే ర్యాంకు ఇస్తారు.
ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే..
ఇద్దరి స్కోర్ ఒకేలా ఉంటే..
గతంలో వయస్సు, హాల్ టికెట్ సంఖ్యను పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇకపై వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఇద్దరి స్కోర్ ఒకేలా ఉంటే మొదట గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం స్కోర్‌లను చూస్తారు. ఇవన్ని చూసినప్పటికీ స్కోర్ ఒకేలా ఉంటే అప్పుడు మూడు సబ్జెక్టుల్లోని తప్పులు, ఒప్పుల నిష్పత్తి ఆధారంగా చూస్తారు.
ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్
ఎవరికైతే తక్కువ మైనస్ మార్కులు ఉంటాయో వారికి మంచి ర్యాంకు ఇస్తారు. ఇవి కూడా సమానంగా ఉంటే వయస్సులో ఎవరు పెద్ద ఉంటే వారికి, హాల్‌టికెట్ ఆధారంగా ర్యాంకు ఇచ్చే వారు. కానీ ఈసారి వయస్సు, హాల్ టికెట్ కొలమానాన్ని తొలగిస్తున్నారు. 100 పర్సంట్ వచ్చిన వారికి తప్ప మిగిలిన వారికి ఒకే స్కోర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య
ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాదికి సంబంధించిన జేఈఈ మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల ఎన్‌టీఏ విడుదల చేసింది. మొదటి విడతలో జనవరి 22 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. రెండో విడతలో ఏప్రిల్ 1 నుంచి పరీక్షలు జరుగుతాయి.
ఇది కూడా చూడండి: Train Accident: రైలు ఢీకొని నలుగురు పారిశుద్ధ్య కార్మికులు మృతి!