సీటెట్ డిసెంబర్ 2024 పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ దేశవ్యాప్తంగా డిసెంబర్ 14, 15వ తేదీల్లో సీటెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్ష జరిగిన కొద్దిరోజులకే సీటెట్ పేపర్ కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసింది.
Also Read: Us:లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు..అగ్నికి ఆహుతైన బైడెన్ కుమారుడి ఇల్లు
తాజాగా ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ సీటెట్ పరీక్ష డిసెంబర్ 14న పేపర్ II ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు జరిగింది.
Also Read: Lay Offs: కొత్త ఏడాదిలో మొదలైన కోతలు..మైక్రోసాఫ్ట్ లో హూస్టింగ్ లు!
అలాగే.. పేపర్ I మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు జరిగింది ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే నిర్వాహకులు తెలిపారు. ఈ సీటెట్ పరీక్ష ఏడాదికి రెండు సార్లు జరుగుతుంది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లుగా ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి 5 తరగతులకు చెప్పే వారికి కోసం.. రెండో పేపర్ 6 నుంచి 9 తరగతులకు బోధించాలనుకునే వారి కోసం పెడతారు.
సీటెట్ (సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) స్కోర్ కి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసుకుంటారు.
Also Read: L And T: భార్యలను ఎంతసేపు చూస్తూ కూర్చుంటారు..ఆదివారాలు పని చేయండి!
Also Read: California: అమెరికాకు సాయం చేసేందుకు మేము రెడీ: ట్రూడో!