TG Group-1: తెలంగాణలో మరోసారి గ్రూప్ -1 వాయిదా వివాదం వేళ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మరో వారంలో జరగబోయే మెయిన్స్ పరీక్షలను యధాతధంగానే నిర్వహించాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. కాగా గురువారం మీడియా సమావేశంలో గ్రూప్-1 అంశంపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
తరువాత మాట్లాడుదామంటూ దాటవేయడం..
ఈ మేరకు గ్రూప్-1 వాయిదా వేస్తున్నారా? అభ్యర్థుల డిమాండ్స్ పరిగణలోకి తీసుకుంటున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నలకు.. దాని గురించి తరువాత మాట్లాడుదామంటూ సీఎం దాటవేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు గ్రూప్-1 పోస్ట్‌పోన్ చేయాలంటూ ఉదయమే గాంధీ భవన్ వెళ్లి పీసీసీ చీఫ్‌ను కలిసిన నిరుద్యోగులకు సాయంత్రంలోగా క్లారిటీ ఇస్తామని పీసీసీ చీఫ్ హామీపై ఎమంటారని అడిగినా సీఎం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దీంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై మరో కీలక నీర్ణయం తీసుకోబోన్నారనే అనే అంశం ఉత్కంఠగా మారింది.
కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్..
ఈ మేరకు G.O. 29 రద్దు చేసి, పాత G.O.55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు తమ డిమాండ్లను లేవనెత్తుతున్నారు. పాత నోటిఫికేషన్‌లోని 503 పోసుల్లో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వొద్దని నిరసనలు చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన 60 పోస్టుల్లో మాత్రమే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రిలిమ్స్‌లో తప్పుల్ని సవరించి, రిజర్వేషన్లపై కోర్టుల్లో పెండింగ్ కేసుల్ని తేల్చాలంటున్నారు. పాత నోటిఫికేషన్ ప్రకారమే రిజర్వేషన్లు, ఓపెన్ కేటగిరి ఉండాలని ప్రభుత్వం ముందు డిమాండ్స్ పెడుతున్నారు.
మెయిన్స్‌కు 31,382 మంది అర్హత..
గత ప్రభుత్వంలో పేపర్ లీక్‌తో ఇప్పటికే పలు మార్లు గ్రూప్-1 రద్దు కాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 22న నోటిఫికేషన్ విడుదల చేయగా 563 పోస్టులకు జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 3.02 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో మెయిన్స్‌కు 31,382 మంది అర్హత సాధించారు. ఇందులో భాంగానే అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే గ్రూప్-1 మెయిన్స్ రీ షెడ్యూల్ చేయాలని అభ్యర్థుల డిమాండ్ చేస్తున్నారు.