ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో ఏపీలో 9 చోట్ల, తెలంగాణలో 7 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Bank of Baroda Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!
మొత్తం పోస్టుల్లో విభాగాల వారీగా ఖాళీలు..
ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్: 140
డిజిటల్ గ్రూప్: 139
రిసీవబుల్ మేనెజ్మెంట్: 202
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 31
కార్పొరేట్, క్రెడిట్ విభాగం: 79
ఫైనాన్స్: 1
ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే పని చేసిన అనుభవం కూడా ఉండాలి.
వయో పరిమితి: ఒక్కో పోస్ట్ బట్టి వయోపరిమితి ఉంటుంది. కనిష్టంగా 22 ఏళ్ల నుంచి గరిష్టంగా 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము 600 రూపాయలు చెల్లించాలి. ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 30/ 10/ 2024
దరఖాస్తులకు చివరి తేదీ: 19/ 11 /2024
ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం