BOB: నిరుద్యోగులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ అర్హతతో భారీగా బ్యాంక్ జాబ్స్! దేశవ్యాప్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Bank of Baroda Recruitment 2024 వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. By Kusuma 03 Nov 2024 in జాబ్స్ Short News New Update షేర్ చేయండి ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా 592 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం పోస్టుల్లో ఏపీలో 9 చోట్ల, తెలంగాణలో 7 చోట్ల ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Bank of Baroda Recruitment 2024 లింక్‌పై క్లిక్ చేయండి. ఇది కూడా చూడండి: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు! మొత్తం పోస్టుల్లో విభాగాల వారీగా ఖాళీలు.. ఎంఎస్ఎంఈ బ్యాంకింగ్: 140డిజిటల్ గ్రూప్: 139రిసీవబుల్ మేనెజ్మెంట్: 202ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 31కార్పొరేట్, క్రెడిట్ విభాగం: 79ఫైనాన్స్: 1 ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి! అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/ సీఎంఏ/ సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత అయి ఉండాలి. అలాగే పని చేసిన అనుభవం కూడా ఉండాలి. వయో పరిమితి: ఒక్కో పోస్ట్ బట్టి వయోపరిమితి ఉంటుంది. కనిష్టంగా 22 ఏళ్ల నుంచి గరిష్టంగా 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము 600 రూపాయలు చెల్లించాలి. ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 30/ 10/ 2024దరఖాస్తులకు చివరి తేదీ: 19/ 11 /2024 ఇది కూడా చూడండి: కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం #bank-of-baroda #bank-jobs-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి