Andhra Pradesh: ఉమ్మడి కర్నూలులో జాబ్‌ మేళా

ఉమ్మడి కర్నూలు జిల్లా నిరుద్యోగాలకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి ప్రైవేట్ కంపెనీలు. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేలా APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

New Update
SSC : నిరుద్యోగులకు శుభవార్త.. 4,187 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్‌ విడుదల!

Job Mela In Kurnool: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. యువతలో వృత్తి నైపుణ్యాన్నిపెంపొందించే విధంగా APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి, ఆపై చదువులు చదివిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని STBC కళాశాల లో జాబ్ మేళీ ఏర్పాటు చేసింది. ఈ నెల 28-2-2024 న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి పి. దీప్తి తెలిపారు.

Also Read:Movies: టైటిల్ వెనక ఉన్న రహస్యం అదే..డైరెక్టర్ నాగ్ అశ్విన్

టెన్త్ చదివితే చాలు..

ఈ మెగా జాబ్ మేళాలో 3 ప్రవైట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఎల్ అండ్, నవభారత్ ఫెర్టిలైజర్, శ్రీరాజా బ్యాగ్స్, ఇంకా ఇతర కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హతగా టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైతే చాలని అధికారులు చెబుతున్నారు. పదవ తరగతి నుంచి B.SC, MSC, ORGANIC CHEMISTRY, బీటెక్, ఎంబీఏ, ఏదైనా డిగ్రీ పూర్తి చేసుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు. రేపు ఉదయం 10:00 గంటల నుండి ఎస్టీబీసీ కాలేజ్‌లో ఈ ఉద్యోగమేళా జరగనుంది. ఈ మేళాను ఉపయోగించుకోవాలని అధికారి పి.దీప్తి పిలుపునిచ్చారు.

Also Read:ISRO: గగన్‌యాన్ వ్యోమగాముల పేర్లను ప్రకటించిన ప్రధాని

Advertisment
తాజా కథనాలు