Ayodya: Ram Mandir: అయోధ్య రామాలయం నిర్మాణం కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం చేస్తున్న మహిళ..

ఝూర్ఖండ్‌లోని ధనబాద్‌కు చెందిన 85 ఏళ్ల సరస్వతి దేవి అనే మహిళ 30 తర్వాత మౌనవ్రతం వీడనుంది. 1992లో అయోధ్యకు వచ్చిన ఆమె అక్కడ రామాలయాన్ని నిర్మించేవరకు మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞచేశారు. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆమె మౌనవ్రతం వీడనున్నారు.

Ayodya: Ram Mandir: అయోధ్య రామాలయం నిర్మాణం కోసం 30 ఏళ్లుగా మౌనవ్రతం చేస్తున్న మహిళ..
New Update

ఈ ఏడాది జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక వేడుక కోసం దేశప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు రామాలయ ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అయోధ్యకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ కూడా అధికారులు అక్కడికి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చాలామంది రామభక్తులు ఉంటారు. అయితే ఝూర్ఖండ్‌లోని ధనబాద్‌కు చెందిన ఓ 85 ఏళ్ల సరస్వతి దేవి అనే మహిళకు మాత్రం శ్రీరాముడు అంటే మాములు భక్తి కాదు.

Also Read: నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. ఒళ్లు గగుర్పొడిచే బెంగళూరు సీఈవో క్రైమ్ కథ!

రామాలయం నిర్మించేవరకు మౌనవ్రతం

30 ఏళ్ల క్రితం అయోధ్యలో రామమందిరం నిర్మించేవరకు తాను మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఇప్పుడు రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ పూర్తైన తర్వాత ఆమె తన మౌనవ్రతాన్ని వీడనున్నారు. అసలేం జరిగిందంటే.. 1992లో బాబ్రి మసీదును కూల్చేసిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన అనంతరం సరస్వతి దేవీ అయోధ్యను సందర్శించారు. అప్పుడే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేవరకు తాను మౌనవ్రతం చేస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి రోజులో 23 గంటల పాటు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటున్నారు.

ప్రాణప్రతిష్ఠ తర్వాత మౌనవ్రతానికి స్వస్థి

ఆమెకు ఏదైన కావాలంటే సైగలతో మాత్రమే అడుగుతారు. కేవలం ఒక గంట సేపు మాత్రమే కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. అయితే 2020లో అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ప్రధాని మోదీ భూమి చేసిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన తర్వాత సరస్వతి దేవీ 24 గంటల మౌనవ్రతాన్ని పట్టారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. మరో విషయం ఏంటంటే సరస్వతి దేవికి జనవరి 22న జరిగే రామాలయం ప్రారంభోత్సవానికి కూడా ఆహ్వానం అందింది. సోమవారం రాత్రి ఆమె అయోధ్యకు బయలుదేరింది. అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తైన తర్వాత ఆమె మౌనవ్రతాన్ని వీడుతారని ఆమె కొడుకు చెప్పారు. ఆమెను స్థానికంగా మౌనీమాత అని కూడా పిలుస్తారాట.

Also Read: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ: రఘునందన్ రావు

5500 కిలోల భారీ ధ్వజస్తంభం

ఇదిలాఉండగా.. ఆయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రామమందిరంలో ఏకంగా 5500 కిలోల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. దీన్ని గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. సోమవారం నాడు ధ్వజస్తంభాన్ని అయోధ్యకు తీసుకొచ్చారు. ఇక ఆలయ ప్రారంభోత్సవాన్ని అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్‌ స్క్వేర్‌లో కూడా ప్రత్యక్షప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది.

#national-news #telugu-news #rammandhir #ayodya-rammandir
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe