Jarkhand CM: ఈడీకి షాకిచ్చిన సీఎం సోరెన్.. అధికారుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ అధికారులకు షాకిచ్చారు. తన మీద విచారణ జరుపుతున్న ఈడీ అధికారులపైనే సోరెన్ కేసు పెట్టారు. వారి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దేశ వ్యాప్తంగా సంచలనం గామారింది.

New Update
Hemanth Soren: ఇక ప్రజా సేవలోనే-హేమంత్ సోరెన్

Jharkhand CM Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన మీద మనీలాండరింగ్ (Money Laundering) ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఈడీ అధికారులు సోరెన్‌కు నోటీసులు (ED Notices) జారీ చేశారు. అయితే అప్పటి నుంచి సోరెన్ కనడబకుండా పోయారు. ఎక్కడు్నారె ఎవ్వరికీ తెలియదు. ఢిల్లీలోని ఆయన నివాసంలో, జార్ఖండ్‌లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాంతో పాటూ ఈడీ అధికారులు తనను మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తారని భావిస్తున్న హేమంత్ సోరెన్.. ఒకవేళ అదే జరిగితే.. సీఎం పదవిని ఆయన భార్యకు కట్టబెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో 2,3 రోజులుగా జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడి రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. మరోవైపు ఈడీ అధికారులు, సోరెన్ మధ్య దోబూచులాట కంటిన్యూ అవుతూనే ఉంది.

Also Read:Least Corrupt Countries:వరల్డ్‌లో అత్యంత తక్కువ అవినీతి దేశాల లిస్ట్‌లో భారత్ ఎక్కడుందో తెలుసా?

రివర్స్ అయిన సీఎం హేమంత్ సోరెన్...

ఇప్పుడు వీటన్నింటికన్నా ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది అక్కడ. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) సడెన్‌గా యూటర్న్ తీసుకున్నారు. తనను విచారణ చేస్తున్న అధికారుల మీదనే సోరెన్ తిరిగి కేసు పెట్టడం సంచలనంగా మారింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తనను వేధిస్తున్నారని.. హేమంత్ సోరెన్.. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం (Prevention of Atrocities) కింద పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఈడీ అధికారుల మీద తగిన చర్యలు తీసుకోవాలని జార్ఖండ్‌లోని ధృవా పోలీస్ స్టేషన్‌లో సోరెన్ ఫిర్యాదు చేశారని రాంచీ పోలీసులు తెలిపారు.

ఈరోజు విచారణ చేసిన ఈడీ..

మనీలాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ను విచారించేందుకు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రాంచీలోని ఆయన నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. 7 వేల మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు మధ్య హేమంత్ సోరెన్‌ను ఈడీ విచారణ జరిపింది. ఇంకా మరికొంత విచారణ కూడా చేసే అవకాశం ఉంది. అలాగే విచారణ పూర్తవ్వగానే హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎంను అరెస్ట్ చేస్తే జార్ఖండ్‌లో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది.దీంతో విచారణకు ఈడీ అధికారులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. రాంచీలోనే కాకుండా జార్ఖండ్ వ్యాప్తంగా కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు