JEE Main Exam: రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు..

రేపటి నుంచి దేశవ్యాప్తంగా 291 నగరాల్లో జేఈఈ మెయిన్ - 2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జరిగే ఈ పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

New Update
JEE Main Exam: రేపటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు..

పరీక్షలకు దాదాపు 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 50 వేల మంది ఈ పరీక్షలను రాయనున్నారు. పరీక్ష సమయానికి 2 గంటల ముందుగానే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి పంపించనున్నారు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌తో సహా మరికొన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: ఘోర అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

బీఆర్క్‌, బీప్లానింగ్‌ పరీక్షను సాధారణ విద్యార్థులకు మూడున్నర గంటల పాటు నిర్వహించనున్నారు. ఇక దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం నాలుగు గంటల 10 నిమిషాల పాటు జరగనుంది.ఇప్పటికే ఈ నెల 4, 5, 6న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ రిలీజ్ చేసింది. మిగతా వారి అడ్మిట్‌కార్డులు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. ఇక పరీక్ష సమయం.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒకటో షిఫ్ట్‌, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిప్ట్‌ ఉంటుంది.

ఇదిలాఉండగా.. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితాలో నుంచి తెలంగాణలో ఐదు పట్టణాలను తొలగించారు. గత ఏడాది రాష్ట్రంలో 16 పట్టణాల్లో పరీక్షలు నిర్వహించారు. కానీ ఈ ఏడాది 11 పట్టణాల్లో మాత్రమే పరిమితం చేశారు. కొత్తగూడెం, నిజామాబాద్‌, సిద్దిపేట, వరంగల్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం,మహబూబ్‌నగర్‌, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పరీక్షల నిర్వహిస్తారు. ఈసారి జగిత్యాల, మేడ్చల్‌, సంగారెడ్డి, మహబూబాబాద్‌, జనగామ జిల్లాలను జాబితా నుంచి తొలగించారు.

Also Read: పెట్రోల్, డీజిల్ ధరలపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్‌..

Advertisment
తాజా కథనాలు