లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో ఎన్డీయే పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థతి వచ్చింది. మరోవైపు ఇండియా కూటమి ఎన్డీయే పార్టీల నేతలకు గాలం వేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే తాజాగా జేడీయూ నేత కేసీ త్యాగి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత నితీష్ కుమార్‌కు ఇండియా కూటమి నుంచి ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ ఆ ఆఫర్‌ను నితీష్ తిరస్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం తాము ఎన్డీయేతో కలిసి ఉన్నామని.. ఇప్పుడు వెనుదిరిగి చూసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండించింది. ఇండియా కూటమి నితీష్ కుమార్‌ను సంప్రదించినట్లు తమ వద్ద సమాచారమే లేదని.. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అన్నారు.
Also Read: ప్రతిపక్షనేతగా రాహుల్ గాంధీ
ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటలేకపోయింది. ఆ పార్టీకి 240 సీట్లు వచ్చాయి. మిత్రపక్షాలతో కలిసి 293 స్థానాలు సొంతం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జేడీయూ పార్టీల అవసరం కీలకంగా మారింది. మరోవైపు ఇండియా కూటమి 232 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలోనే తమ బలం పెంచుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌కు ప్రధాని ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
Also read: లింగ సమానత్వంపై పిల్లలకు పాఠాలు