JD Lakshmi Narayana: ఎక్కడ నుంచి పోటీ చేస్తాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చిన జేడీ! సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సీబీఐ నుంచి తప్పుకున్న తరువాత ఆయన చూపు రాజకీయాల మీద పడింది. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఆయన విశాఖ పట్నం నుంచి పోటీ చేశారు. By Bhavana 23 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి JD Lakshmi Narayana: సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. సీబీఐ (CBI) నుంచి తప్పుకున్న తరువాత ఆయన చూపు రాజకీయాల మీద పడింది. ఈ క్రమంలోనే ఆయన జనసేన పార్టీ (Janasena Party)లో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సూచనల మేరకు ఆయన విశాఖ పట్నం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు పరాజయమే ఎదురైంది. ఆ ఓటమి తరువాత జేడీ రాజకీయాల పై పెద్దగా ఆసక్తి చూపించలేదనే తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆయన జనసేన కు సంబంధించిన ఏ సమావేశంలో కానీ, సభలో కానీ కనిపించింది లేదు. ఇలా సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఆయన ఒక్కసారిగా జనసేనకు బై చెప్పి బయటకు వచ్చారు. ఆ తరువాత ఆయన విశాఖ పట్నం స్టీల్ ప్లాంట్ గురించి జరుగుతున్న పోరాటంలో ఆయన చాలాసార్లు పాల్గొని మీడియా దృష్టిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఆ పార్టీలో చేరుతున్నారు..ఈ పార్టీలో చేరుతున్నారు అనే మాటలు బయట షికారు చేస్తున్నాయి. ఇప్పటి వరకు దీని గురించి జేడీని అడిగినప్పటికీ ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ క్రమంలో ఆయన సోమవారం మీడియా ముందు ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ఆయన విశాఖపట్నం నుంచి లోక్ సభ స్థానానికి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నట్లు తెలిపారు. సోమవారం ఆయన నందిగామలోని ఓ ప్రైవేటు పాఠశాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన ఓటర్లకు ఓ పిలుపుని కూడా ఇచ్చారు..ప్రజాస్వామ్యం అనే దానిలో పార్టీలు, కులాలను చూసి కాదు..పోటీ చేస్తున్న వ్యక్తులను చూసి ఓటు వేయాలే తప్ప వారు ఇచ్చే లంఛాలు కు ఆశపడి కాదు అని పేర్కొన్నారు. ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది. అలాంటి ఆయుధాన్ని ఈ రోజుల్లో చాలా మంది అమ్ముకుంటున్నారు. దయచేసి అలా ఎవరూ చేయవద్దు. అలా చేస్తే ముందు తరాల వారికి భవిష్యత్తు లేకుండా పోతుందని ఆయన విజ్ఙప్తి చేశారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ కచ్చితంగా వినియోగించుకోవాల్సిందే. లేని పక్షంలో ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో వారి పై చర్యలు తీసుకునే విధంగా ఎన్నికల సంఘాన్ని కోరతాను అన్నారు. జేడీ కానీ పార్టీలో చేరతాను అని ఒక్క మాట అన్నట్లు అయితే కనుక రాష్ట్ర పార్టీలు అయిన టీడీపీ (TDP), జనసేనతో పాటు వైసీపీ (YCP) కూడా రెడీగా ఉంది. ఎందుకంటే కొంత కాలం క్రితం ఓ సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసించారు. దీంతో అందరూ ఆయన వైసీపీలో చేరతారు అని అనుకున్నారు. కానీ వైసీపీలో చేరే విషయం గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక పోతే ఆయన పొరపాటున కూడా బీజేపీలో చేరరు. ఆయన స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలిచారు కాబట్టి..ఆయన బీజేపీలో చేరే ప్రసక్తి లేదు. ఇక జనసేన నుంచి బయటకు వచ్చారు కాబట్టి జనసేనకు వెళ్లేందుకు ఆయన సుముఖత చూపడం లేదు. సో ఆయన మొత్తానికి ఇండిపెండెట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఓ క్లారిటీ అయితే వచ్చింది. Also Read: ప్రాణం పోయినా అమర్నాథ్ అవినీతికి పాల్పడడు! #jd-lakshmi-narayana #politics #andhrapradesh #vizag #janasena-jd-lakshmi-narayana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి