JD Lakshmi Narayana: బీఆర్ఎస్ అభ్యర్థికి నా మద్దతు.. జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన
జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేశారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి తన మద్దతును ప్రకటించారు. కాగా లోక్ సభ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా ఆయన పోటీ చేసిన విషయం తెలిసిందే.