JayaPrakash Narayana: ఏపీలో రాష్ట్రపతి పాలన.. RTVతో మాజీ ఐఏఎస్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న మాజీ సీఎం జగన్ ఆరోపణల్లో పసలేదని మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. RTVకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాష్ట్రంలో గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరుపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

New Update
JayaPrakash Narayana: ఏపీలో రాష్ట్రపతి పాలన.. RTVతో మాజీ ఐఏఎస్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ!

AP Politics: ఏపీలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంపై మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయా పరిస్థితులపై RTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. మన దేశంలో చట్టబద్ధ పాలన సరిగా లేదని, బడితే ఉన్నవారితే బర్రె అన్నారు. ఏపీలో గత ఐదేళ్లుగా అప్రజాస్వామిక పాలన జరిగిందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారని, విచారణ పద్ధతులు, పోలీసులు, తదితర శాఖలను సరైన మార్గంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో సంక్షేమం, అభివృద్ధిలో సమన్వయం చూపించారని, కానీ గత ఐదేళ్ల పాలనలో మాత్రం అవేవీ కనిపించలేదంటూ జగన్ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

మాఫియా పరిపాలన..
జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ స్థాయిలో తిరస్కరించడానికి కారణం అడ్డగోలు పరిపాలనే అన్నారు. ప్రజా ప్రయోజనాలు ఏమీ లేకుండా మాఫియా పరిపాలన కొనసాగిందన్నారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజలు కూడా గడవకముందే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్ వి రాజకీయా ఆరోపణలు తప్పా అందులో పెద్దగా పసలేదన్నారు. ఇక గత పాలకుల తీరు శృతిమించిందని చెప్పిన జయప్రకాశ్.. ఇప్పటికైనా నాయకులు అది గమనించి నడుచుకోవాలంటూ కీలక సూచనలు చేశారు. జయప్రకాశ్ నారాయణ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు