Jayalalitha: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన నగలు, స్థిరాస్తులను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో జరిమానా చెల్లించేందుకు 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, వజ్రాల నగలను అమ్మకానికి పెట్టనున్నారు. రూ.60 కోట్ల స్థిరాస్తులను అమ్మేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.

Jayalalitha: జయలలిత నగలు, స్థిరాస్తుల వేలం.. ఎన్నికోట్లు రానున్నాయంటే!
New Update

Jayalalitha Gold & Assets Auction: దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబందించిన నగలు, స్థిరాస్తులను వేలం వేయనున్నారు. అక్రమాస్తుల కేసులో జరిమానా చెల్లించేందుకు ఆమె 28 కిలోల బంగారు నగలను అమ్మకానికి పెట్టనున్నారు. ఈ మేరకు 2014లో బెంగళూరు ప్రత్యేక కోర్టు (Bangalore Court) జయలలితకు 4ఏళ్ల జైలుశిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు 4ఏళ్ల జైలు శిక్ష, తలా రూ.10 కోట్ల జరిమానా విధించింది.

ఆస్తులు అమ్మి జరిమానా..
అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ నలుగురు కర్ణాటక హైకోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. దీంతో కేసు విచారించిన న్యాయస్థానం నలుగురిని విడుదల చేస్తూ తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే అనంతరం కర్ణాటక ప్రభుత్వం (Karnataka Government) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ విచారణ సమయంలో 2016 డిసెంబరు 5న జయలలిత చనిపోయారు. దీంతో సుప్రీంకోర్టు బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పుని సమర్థించగా.. జయలలిత మరణించి 6ఏళ్లు గడిచినా ఆమె చెల్లించాల్సిన జరిమానా కట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు. దీంతో ఆమె ఆస్తులు అమ్మి జరిమానా చెల్లించేందుకు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి : Liquor Scam : కవితకు మరో బిగ్ షాక్.. న్యాయవిచారణకు దిగిన సీబీఐ!?

కేసు ఖర్చుగా రూ.5 కోట్లు..
ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో అవినీతి నిరోధకశాఖ (ACB) స్వాధీనం చేసుకున్న 28 కిలోల బంగారు నగలు, 800 కిలోల వెండి నగలు, వజ్రాల నగలను కోర్టుకు అప్పగించారు. ఈ నగలను వేలం వేసి వచ్చిన నగదుతో జరిమానా చెల్లించేందుకు నిర్ణయించారు.ఆ మేరకు నగలను మార్చి 6, 7 తేదీల్లో తమిళనాడు తీసుకొచ్చి హోంశాఖ కార్యదర్శికి అప్పగించనున్నారు. వాటిని ప్రభుత్వ ఖజానాలో ఉంచి, ఆ తర్వాత వాటికి ప్రస్తుత విలువ నిర్ణయించి వేలం వేయనున్నారు. ఈ నగలే రూ.40 కోట్లు వరకు ధర పలకనుండగా.. మిగిలిన రూ.60 కోట్లకు స్థిరాస్తులను వేలం వేయనున్నారు. కేసు ఖర్చుగా రూ.5 కోట్లు కర్ణాటక ప్రభుత్వానికి ఇవ్వాల్సివుండగా.. జయలలిత (Jayalalitha) పూర్తి ఆస్తులను అమ్మేసి ఫీజు చెల్లించనున్నారు.

#jayalalitha-assets #jayalalitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి