Cricket:ఐసీసీ ర్యాంక్సింగ్‌లో బుమ్రా అరుదైన ఘనత

భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ వరల్డ్ ర్యాంక్సింగ్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి నంబర్ వన్‌గా నిలిచిన మూడో క్రికెటర్‌గా రికార్డ్ సాధించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన క్రికెటర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు.

Cricket:ఐసీసీ ర్యాంక్సింగ్‌లో బుమ్రా అరుదైన ఘనత
New Update

Jaspreeth Bumra:క్రికెట్‌ చరిత్రలో అన్ని ఫార్మాట్లలో నంబర్‌ వన్‌ ర్యాంకును సాధించిన తొలి బౌలర్‌గా జస్ప్రీత్‌ బుమ్రా చరిత్ర సృష్టించాడు. 2017లో టీ20ల్లో మొదటిసారిగా బుమ్రా అగ్రస్థానాన్ని దక్కించుకొన్నాడు. తరువాత 2018లో వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరిన ఈ స్టార్‌ బౌలర్‌ 2022 వరకు అదే పొజిషన్‌లో కొనసాగాడు. ఇప్పుడు తాజాగా టెస్టుల్లోనూ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్లు పాంటింగ్‌, హేడెన్‌, టీమిండియా రన్‌ మెషీన్‌ కోహ్లీ మూడు ఫార్మెట్లలోనూ ఏదో ఒక సందర్భంతో నంబర్‌-1 స్థానంలో నిలిచారు. ఇందులో పాంటింగ్‌, హేడెన్‌ చాలా కొద్ది కాలమే టీ20ల్లో నంబర్‌-1 ప్లేస్‌లో కొనసాగారు. ఇక ఇలా మూడు ఫార్మెట్లలో నంబర్-1 బౌలర్ గా నిలిచిన ఏకైక బౌలర్ బుమ్రా మాత్రమే.

Also Read:Parliament:మోడీ పదేళ్ళ పాలన మీద కాంగ్రెస్ బ్లాక్ పేపర్..

ఒకే ఒక బౌలర్:
ఇండియన్‌ టెస్టు క్రికెట్‌లో స్వదేశీ గడ్డపై స్పిన్నర్లదే రాజ్యం. ఇంతకు ముందు అశ్విన్‌, జడేజా, బిషన్‌సింగ్‌ బేడి టెస్టుల్లో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌-1 పొజిషన్‌కు చేరుకున్నారు. ఈ ముగ్గురు కూడా స్పిన్నర్లే. అయితే ఇప్పుడు ఈ స్థానాన్ని బుమ్రా సొంతంత చేసుకున్నాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో నంబర్‌-1 పేసర్‌గా నిలిచిన రికార్డు సృష్టించాడు . టెస్టుల్లో కనీసం 150వికెట్లు తీసిన బౌలర్లలో రెండో బెస్ట్ బౌలింగ్‌ యావరేజ్‌ కలిగిన ప్లేయర్‌ కూడా బుమ్రానే. ఇతను ఎంత మంచి బౌలర్ అంటే స్పిన్లకు అనుకూలించే పిచ్‌ల మీద కూడా వికెట్లు తీయగలడు. భారత్‌ ఉపఖండపు పిచ్‌లు అన్నీ దాదాపు స్పిన్‌కు అనుకూలించేవే ఉంటాయి. కానీ వీటి మీద ఎక్కువ వికెట్లు తీసిన ఘనత బుమ్రాకే దక్కుతుంది. విశాఖ టెస్టులో మొత్తంగా 9 వికెట్లు పడగొట్టడమే ఇందుకు నిదర్శనం. దీంతోనే ఇంగ్లండ్‌తో రెండో టెస్టు తర్వాత ఐసీసీ విడుదల చేసిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఫస్ట్‌ పొజిషన్‌కు దూసుకొచ్చాడు.

సపోర్ట్ తక్కువే:
అయితే బుమ్రాకు భారత్‌ అభిమానుల మద్దతు కాస్త తక్కువనే చెప్పాలి. తరుచుగా గాయాలపాలవడంతో బుమ్రాపై అనేక విమర్శలు వస్తుంటాయి. దీనికి కారణం బుమ్రా విషయంలో బీసీసీఐ చేసిన తప్పిదాలే . గాయం నుంచి కోలుకున్న వెంటనే బుమ్రాని బరిలోకి దింపేవాళ్లు.. కనీసం గ్యాప్‌ కూడా ఇవ్వకుండా ఆడించేవాళ్లు. ఇలా రెండు సార్లు బీసీసీఐ చేసిన పొరపాటుకు బుమ్రా బలయ్యాడు. మూడోసారి గాయంలో బీసీసీఐ ఆ తప్పు చేయలేదు. అందుకే దాదాపు ఎడాదిన్నర పాటు బుమ్రా జట్టులో కనిపించలేదు. గతేడాది వరల్డ్‌కప్‌కు ముందు ఐర్లాండ్‌తో సిరీస్‌తో కమ్‌బ్యాక్‌ ఇచ్చిన బుమ్రాను సెలక్టివ్‌గా సిరీస్‌లు ఆడిస్తుండడం మంచి విషయమే.

#cricket #icc #jaspreeth-bumra #one-rank
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe