Emergency Alert in Japan: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) రష్యా పర్యటనలో ఉన్నారు. ఇదిలా ఉంటే జపాన్ ప్రధాని అధికారిక హ్యాండిల్ నుంచి చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తర కొరియా అనుమానాస్పద బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Fumio Kishida) తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశారు. దీంతో ఆయన ఎమర్జెన్సీ అలర్ట్ ప్రకటించారు. ఈ వార్తల తరువాత, జపాన్ (Japan) చాలా అప్రమత్తంగా ఉంది. ఎమర్జెన్సీ అలర్ట్ తర్వాత జపాన్ ప్రధాని కొన్ని సూచనలు చేశారు. సాధ్యమయ్యే ప్రతి ప్రయత్నం చేయాలని, గరిష్ట సమాచారాన్ని సేకరించి విశ్లేషించాలని తెలిపారు. అలాగే, సరైన, ఖచ్చితమైన, సత్వర సమాచారాన్ని ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. విమానాలు, సముద్ర నౌకలు, ఇతర ఆయుధాలు, ఆస్తుల భద్రతను తక్షణమే నిర్ధారించాలని ప్రధానమంత్రి ఆదేశించారు.
అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సన్నాహాలు చేయాలని జపాన్ ప్రధాని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నారు. అవసరమైనప్పుడు ఊహించని పరిణామాలకు సిద్ధంగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేశారు. జపాన్, ఉత్తర కొరియాల మధ్య చాలా కాలంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఉత్తర కొరియా క్షిపణి, అణ్వాయుధ పరీక్షలపై జపాన్ పదే పదే ప్రశ్నలు లేవనెత్తూ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ, పరీక్షలు, ఆయుధాలపై ఉత్తర కొరియా యొక్క ముట్టడి కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ఘోరరోడ్డు ప్రమాదం..బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది మృతి..!!