Japan:జపాన్‌లో పెద్ద విమానాశ్రయాల్లో హనేడా ఒకటి. ఇది రాజధాని టోక్యోలో ఉంది. ఇక్కడ జపాన్‌కు చెందిన జేఎల్ 516 విమానం ప్రమాదానికి గురైంది. రన్‌వే మీద దిగుతుండగా మంటల్లో చిక్కుకుంది. ఇవి క్షణాల్లో మొత్తం ప్లైన్ అంతా వ్యాపించాయి. జేఎల్ 516 విమానం హోక్కైడో నుంచి వచ్చింది.
Also Read:ట్రక్ డైవర్ల సమ్మె-బంకుల్లో నిలిచి పోయిన పెట్రోల్, డీజిల్
విమాన ప్రమాదం మీద ఎయిర్ లైన్స్ అధికారులు ప్రాథమిక దర్యాప్తును ప్రకటించారు. ఫ్లైట్ రన్‌వే మీద దిగుతుండగా అక్కడే ఉన్న కోస్టు గార్డు ఎయిర్ క్రాఫ్ట్‌ను ఢీకొందని అందుకే మంటలు వచ్చాయని జపాన్ నేషనల్ మీడియా ఎన్‌హెచ్‌కే కు తెలిపారు. విమానానికి అంటుకున్న మంటలు ఇప్పటికీ అదుపులోకి రాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమానంలో 400 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటూ కొంతమంది సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరినీ బయటకు అయితే తీసుకువచ్చారు. అయితే ఇందులో ఎంత మంది గాయపడ్డారో, ఎవరైనా చనిపోయారా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.