International: పదవిని అడ్డంపెట్టుకుని వేధింపులు..జపాన్ మేయర్ ఆగడాలు

ఒకరిని.. కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా 99 మందిని లైంగికంగా వేధించాడు.. ఎవరైనా అందమైన అమ్మాయిపై తన కన్ను పడిందా..? అంతే అనుభవించాల్సిందే.. ? పదవిని అడ్డంపెట్టుకొని బరితెగించిన మేయర్‌కు ఎట్టకేలకు శిక్ష పడింది. జపాన్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

International: పదవిని అడ్డంపెట్టుకుని వేధింపులు..జపాన్ మేయర్ ఆగడాలు
New Update

Japan Mayor Hideo Kojima: పదవీ వ్యామోహంలో ఎన్నో అరాచకాలు చేశాడు. 99 మందిని లైంగికంగా వేధించాడు. చివరికి అతని పాపం పండింది. విషయం సోషల్‌ మీడియాలో బయటపడింది...తర్వాత వైరల్‌గా మారింది. ఆ నోటా.. ఈ నోటా విషయం అందరికీ తెలిసిసోయింది. దీంతో అతడి ఆకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి.

జపాన్‌లోని సెంట్రల్ గిఫు పట్టణ మేయర్ హిడియో కొజిమా (Hideo Kojima). ఇతని వయసు 74 ఏళ్ళు. వయసు ముదిరింది, కాటికి కాళ్ళు జాచుకునే వయసు వచ్చింది కానీ బుద్ధి మాత్రం మారలేదు. ఎక్కడి పడితే అక్కడ తన చాపల్యాన్ని ప్రదర్శించాడు. మున్సిపల్‌ ఉద్యోగులు, సిబ్బంది పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. రోజురోజుకూ అతడి బాధితులు ఎక్కువయ్యారు. ఎవరికీ చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుంగిపోయారు. ఇలా ఏకంగా 99 మంది మీ లైగింక వేధింపులకు పాల్పడ్డాడు హిడియో కొజిమా.

కానీ తప్పుడు పనులు ఎక్కువ కాలం సాగవు. కొజిమా చర్యలకు విసుగెత్తిన కొంతమంది సోషల్‌ మీడియాలో అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. అతడి బాగోతాన్ని బట్టబయలు చేశారు. ఈ పోస్టులు వైరల్‌గా మారడంతో అక్కడ పెద్ద దుమారమే రేగింది. ఈ విషయం ప్రభుత్వ స్థాయి వరకూ వెళ్ళింది. దీంతో జపాన్ ప్రభుత్వం అతడి అరాచకాలపై ఓ స్వతంత్ర కమిటీని వేసింది. ఈ కమిటీ మేయర్‌ అరాచకాలపై సర్వే నిర్వహించింది.

మున్సిపాలిటీలో 193 మందిని సర్వే చేసింది కమిటీ. అందులో 161 మంది మేయర్ మీద కంప్లైంట్ చేశారు. తమకు అసౌకర్యంగా, అనుచితంగా ప్రవర్తించేవాడని...లైంగికంగా వేధించే వాడని చెప్పారు. మొత్తం 99 మందిపై మేయర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని కమిటీ సర్వేలో తేలింది. దీంతో కమిటీ మేయర్‌ను దోషిగా నిర్ధారించింది. దీంతో కొజిమా తన పదవికి రాజీనామా చేశారు. ఇంత జరిగినా మహానుభావుడికి బుద్ధి మాత్రం రాలేదు. తాను చేసిన పనిని ఇంకా సమర్ధించుకుంటూనే ఉన్నాడు. తాను కావాలని చేయలేదని ..వారు తన గురించి తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తనని తానే వెనకేసుకున్నాడు.

దీంతో సోషల్‌ మీడియాలో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. వెంటనే అతడు తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌ మొదలైంది. ఇంకేముంది చేసేదేం లేక తన పదవికి రాజీనామా చేశాడు. అతడు ఎవరో.. ఈ సంఘటన జరిగింది ఎక్కడో మీరే చూడండి..

Also Read:Telangana : యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టే.. మళ్ళీ పేరు మార్పు

#japan #sexual-harassment #hideo-kojima
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe