Japan: జపాన్‌కు భారీ భూకంపం, సునామీ భయం

రెండు రోజుల క్రితమే జపాన్‌ను భూకంపం వణికించింది. ఇప్పుడు మళ్ళీ మరో మారు భారీ భూకంపం...దాంతో పాటూ సునామీ కూడా రావచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. రెక్టర్ స్కేల్ మీద 8 లేదా 9 తీవ్రతతో భూకంపం రావచ్చని చెబుతోంది.

New Update
Japan: జపాన్‌కు భారీ భూకంపం, సునామీ భయం

Mega Earth Quack: మరో భారీ భూకంపం, సునామీ హెచ్చరికతో జపాన్ వాసులు బెంబేలెత్తి పోతున్నారు. రెండు రోజుల క్రితం ఇక్కడ7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ 8 లేదా 9 తీవ్రతతో భూకంపం రావచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతలా భూమి కంపిస్తే...సునామీ కూడా వస్తుందని చెబుతున్నారు. దీని కోసం ప్రజలు సంసిద్ధంగా ఉండాలని చెప్పింది.

ఈ హెచ్చరికలతో జపాన్ వాసులు వణికిపోతున్నారు. ఈ దేశ ప్రధాని కిషిదా కూడా తన ఆసియా పర్యటనను రద్దు చేసుకున్నారు. తాను దేశంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని తెలిపారు. రెండు రోజుల క్రితం వచ్చిన భూకంపం కారణంగా 14 మంది చనిపోయారు. ఇప్పుడు భారీ భూకంపం గురించి జపాన్ వాతావరణ శాఖ ముందే హెచ్చరించడంతో అక్కడి అధికారులు, ప్రభుత్వాధినేతలు అప్రమత్తమయ్యారు. ఎక్కువ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఈ హెచ్చరికలతో జపనీయులు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం లేదు. ఏం కావాలన్నా ఆన్‌లైన్ బుకింగ్‌లు చేసుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగాలకు కూడా వెళ్ళడం లేదు. దీంతో అక్కడి రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల స్టోర్లలోనే హెచ్చరికలు పెట్టారు. హార్డింగులకు దూరంగా ఉండాలంటూ సూచిస్తున్నారు.

Also Read:  Vinesh Phogat: వినేశ్ ఫోగాట్‌పై తీర్పు రేపటికి వాయిదా

Advertisment
తాజా కథనాలు