Watch Video: జపాన్ భూకంపాన్ని ముందే పసిగట్టి ప్రకృతి.. షాకింగ్ వీడియో..! జపాన్‌లో సంభవించిన భారీ భూకంపాన్ని కాకులు ముందే పసిగట్టాయి. భూకంపం సంభవించడానికి ముందు.. వేలాది పక్షలు జపాన్ తీర ప్రాంతంలో గుమిగూడాయి. రోడ్లపై వేల సంఖ్యలో కాకులు వచ్చి చేరాయి. ప్రకృతి విపత్తును ముందే పసిగట్టడం ద్వారా కాకులు ఇలా చేశాయని కొందరు అంటున్నారు. By Shiva.K 02 Jan 2024 in ఇంటర్నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Japan Earthquake: ఈ భూ ప్రపంచంలో మనుషులతో పాటు.. అనే ఇతర జీవరాశులు కూడా నివసిస్తున్నాయి. అయితే, మనిషికి మాత్రమే ప్రకృతికి దూరమై.. ఆ ప్రకృతికి శత్రువుగా మారుతున్నాడు. అదే మనుషులతో జీవనం సాగిస్తున్న మూగ జీవాలు మాత్రం ప్రకృతిలో మమేకమవుతున్నాయి. అందుకే.. మనుషుల కంటే ముందుగానే ప్రకృతి విపత్తులను పసిగట్టేస్తున్నాయి. తాజాగా జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూపంకం సృష్టించిన విధ్వంసానికి వాయవ్య జపాన్ తీర ప్రాంతం అతలాకుతలం అయ్యింది. చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో జనాలు మృత్యువాత పడ్డారు. అయితే, ఇంత భారీ విపత్తును పక్షులు ముందే పసిగట్టాయి. భూకంపాన్ని ముందే గుర్తించిన కాకులు భారీ సంఖ్యలో ఒకే చోట గుమిగూడాయి. ఇందకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ప్రకృతిని అర్థం చేసుకునే శక్తి మనుషుల కంటే పక్షులకు అధికంగా ఉందని అంటారు. వాటిలో ఉండే గ్రహణ శక్తి మనిషి కంటే ఎన్నో రెట్లు అధికం అంటారు. ఆ కారణంగానే.. జపాన్‌లో సంభవించిన భూకంపాన్ని కూడా పక్షులు ముందే పసిగట్టాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో జపాన్‌లోని హోన్షులో అకాశంలో వేలాది కాకులు ఎగురుతూ క్యోటో సమీపంలోని జపనీస్ ద్వీపానికి చేరుకున్నాయి. కుప్పలు కుప్పలుగా రోడ్లపై వాలాయి. అరుపులు, విచిత్ర ప్రవర్తనతో హడలెత్తించాయి. పక్షుల గుంపు అలా ప్రవర్తించిన కాసేపటిలోకే జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా, 2024 నూతన సంవత్సరం తొలి రోజే జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. జపాన్‌లోని వాయువ్య తీరంలో సోమవారం సాయంత్రం పలుమార్లు భూమి కంపించింది. ఈ భూకంపం ధాటి తీర ప్రాంతంలోని ఇళ్లన్నీ నేలమట్టం అయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. The sudden increase in crow activity in #Japan is causing concern among residents, reminiscent of an ancient omen associated with natural disasters. On the first day of 2024, Japan is struck by a significant #earthquake#Tsunami pic.twitter.com/vNLoM1JRWu — Surajit (@surajit_ghosh2) January 1, 2024 Also Read: హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు.. ఇదిగో వీడియోలు! తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు.. #viral-news #japan #trending-news #japan-earthquake #crow-activity-in-japan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి