Japan Earth Quake: పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఒళ్లు గగుర్పొడిచేలా భూకంప వీడియోలు!

భారీ భూకంపాలతో జపాన్‌ అల్లకల్లోలంగా మారింది. సెంట్రల్‌ జపాన్‌లో ఒక్కరోజులో 155 భూకంపాలు రావడంతో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు భూకంప ధాటికి ఏకంగా 30మంది చనిపోవడం కలవరపెడుతోంది. ఇక భూకంపానికి సంబంధించిన వీడియోల కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి.

New Update
Japan Earth Quake: పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఒళ్లు గగుర్పొడిచేలా భూకంప వీడియోలు!

Japan Earth Quake: జపాన్‌లో భారీ భూకంపం సంభవించడంతో రష్యా, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు సునామీ హెచ్చరికలు (Tsunami Warnings) జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు భూకంపానికి బలైపోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. జపాన్‌లో బలమైన భూకంపాలు సంభవించిన తరువాత ఇప్పటివరకు 30 మంది మరణించారు. విపత్తు పరిమాణాన్ని అంచనా వేయడానికి అధికారులు కష్టపడుతున్నారు. ద్వీప దేశం ఏకంగా 155 భూకంపాలతో దెబ్బతిన్నతి. భూకంప తీవ్రత ఏకంగా రిక్టెర్‌ స్కెల్‌పై ఏకంగా 7.6 ఉండడంతో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్థి నష్టం జరుగుతోంది. మరోవైపు సహాయిక చర్యలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భూకంపానికి చెందిన వీడియోలు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.

ALSO READ: ఆ ముగ్గురు ఔట్.. నంబర్‌-1 ఆటగాడి స్థానంలో ఆల్‌రౌండర్‌.. తుది జట్టు ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు