Japan:మొట్టమొదటిసారి జపాన్‌లో 17నిమిషాలు ఆలస్యం అయిన బుల్లెట్ ట్రైన్..ఎందుకో తెలుసా..

60 ఏళ్ళల్లో తొలిసారి జపాన్ బుల్లెట్ ట్రైన్ ఆలస్యం అయింది. అది కూడా ఏకంగా 17నిమిషాలు. దీనికి కారణం ఓక పాము. జపాన్‌లో ఇదో పెద్ద టాపిక్ ఇప్పుడు. దాని కధేమిటో తెలుసుకుందాం రండి.

Japan:మొట్టమొదటిసారి జపాన్‌లో 17నిమిషాలు ఆలస్యం అయిన బుల్లెట్ ట్రైన్..ఎందుకో తెలుసా..
New Update

Japan Bullet Train: జపాన్ బుల్లెట్స్ ట్రైన్స్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ప్రంచంలో అందరూ మామూలు ట్రైన్స్ నడుపుతుంటే...జపాన్ మాత్రం అందరికంటే ముందుకు వెళ్ళిపోయి 60ఏళ్ళ క్రితమే బుల్లెట్ ట్రైన్స్‌ను నడిపింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నడిచే ఈ ట్రైన్స్‌ను అక్కడ షింకన్‌సేన్‌ అనిపిలుస్తారు. ఈ ట్రైన్స్ మొత్తం ప్రపంచానికే ఒక రోల్‌ మోడల్. దీన్ని చూసాకే చాలా చోట్ల బుల్లెట్ ట్రైన్స్‌ను నడిపిస్తున్నారు. త్వరలోనే భారతదేశంలో కూడా బుల్లెట్‌ ట్రైన్‌ నడవనుంది. ఇక జపాన్ షింకన్‌సేన్‌ ట్రైన్స్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఈ రైళ్ళు అత్యంత వేగంగా నడవడమే కాదు...ఇప్పటివరకు ఒక్కసారిగా ఆలస్యం అవలేదు. అలాంటిది మొదటి సారి జపాన్ బుల్లెట్ ట్రైన్ ఆలస్యం అయింది.

17 నిమిషాలు ఆలస్యం అయిన ట్రైన్..

నిన్న సాయంత్రం జపాన్‌లో నగోయా నుంచి టోక్యో మధ్య ప్రయాణిస్తున్న బుల్లెట్ ట్రైన్ మొదటిసారిగా 17 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళింది. అయితే దానికి కూడా ఓ రీజన్ ఉంది. ఆ రీజన్ ఒక పాము. బుల్లెట్ రైలులో 40 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఓ పాము..ఫ్యాసెంజర్‌కు కనిపించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అతను రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో ముందుగా ఆ రైలును ఆపేశారు. పాము ఏంటి, విషపూరితమైనదా కాదా అనే వివరాలు తెలియలేదు కానీ అధికారులు పామును వెంటనే పట్టుకున్నారు. అయితే ఆపాము బుల్లెట్ రైలులోకి ఎలా వచ్చింది అన్నది కూడా తెలియలేదు. కానీ పాము వల్ల ప్రయాణికులకు ఎటువంటి హానీ జరగలేదు. అయితే ట్రైన్ మాత్రం 17నిమిషాలు ఆలస్యం అయింది.

17 నిమిషాలు ట్రైన్ ఆలస్యం అవడం మనకు ఏమీ పెద్ద విషయం కాదు. మన దగ్గర గంటలు గంటలు ట్రైన్స్ ఆలస్యంగా నడుస్తాయి. ఒక్కోసారి రోజుల తరబడి కూడా ఆలస్యం అయిన సందర్భాలున్నాయి. మిగతా దేశాల్లో కూడా ఇలాంటివి చాలానేసార్లు జరిగాయి. కానీ జపాన్‌లో మాత్రం ట్రైన్ ఆలస్యం అవడం పెద్ద విచిత్రం. అక్కడ ట్రైన్స్, ప్రత్యేకంగా బుల్లెట్ ట్రైన్స్ ఎప్పుడూ లేటవలేదు. ఒకవేళ ఎప్పుడైనా అయినా కూడా ఒక నిమిషం, అరనిమిషం అంతే. అలాంటిది ఇప్పుడు ఏకంగా 17నిమిషాలు బెల్లెట్ ట్రైన్ ఆలస్యం అయ్యేసరికి ఇప్పుడు జపాన్‌లో అదో పెద్ద టాపిక్ అయిపోయింది.

Also Read:Whats App: ఇండియాలో ఏఐ వాట్సాప్..ఎలా వాడాలో తెలుసా..

#shinkansen #bullet-trains #late #japan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి