జన్వాడ ఫాంహౌస్ నిర్మాణానికి రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల నుంచి పర్మిషన్ లేదని అధికారులు ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్‌పల్లి మండలం జన్వాడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ఫాంహౌస్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధీనంలో ఉందనే ప్రచారం నడుస్తోంది. అలాగే ళ్ల రెవెన్యూ డివిఇది బుల్కాపూర్ నాలా బఫర్‌జోన్ పరిధిలో ఉందనే ఆరోపణలు రావడంతో చేవెజన్ అధికారులు అంతర్గతంగా పలు అంశాలను సేకరించినట్లు సమాచారం.
Also Read: హైడ్రా ఎఫెక్ట్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కలిసివస్తుందా?
జన్వాడ ఫాంహౌస్ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న బుల్కాపూర్ నాలా పరీవాహక ప్రాంతంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు గురువారం సర్వే చేశారు. శాటిలైట్ చిత్రాలు, గ్రామ పటాలను పోల్చారు. నాలా బఫర్‌జోన్‌లో ఫాంహౌస్ ఉందా ? లేదా ? అని నిర్ధారించాక రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు నివేదిక ఇవ్వనున్నారు.