/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/janhavi-jpg.webp)
Janhvi Kapoor Visit To Tirumala Temple: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) పుట్టిన రోజు వేడుకలు బుధవారం నాడు జరిగాయి. ఈ సందర్భంగా జాన్వీ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చింది. అయితే ఈసారి జాన్వీ ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో ప్రత్యేకమైన వ్యక్తి కూడా ఉన్నాడు.
అతను ఎవరో కాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ (Shikhar Pahariya). దీంతో వీరిద్దరి ఫొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ నెట్టింట్లో వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇంతకు ముందు కూడా జాన్వీ శికర్ తో కలసి స్వామి వారి దర్శనానికి వచ్చింది. వీరిద్దరి వెంట సినీ నటి మహేశ్వరి కూడా ఉన్నారు. అనంతరం వీరు జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ప్రత్యేక పూజలు కూడా చేశారు. జాన్వీ త్వరలోనే తారక్ తో కలిసి తెలుగు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Today, our beloved #Thangam, #JanhviKapoor, graced Tirumala with her presence ♥️😍@tarak9999 #JrNTR #Devara #HappyBirthdayJanhviKapoor pic.twitter.com/GeKQ7DrGre
— poorna_choudary (@poornachoudary1) March 6, 2024
ఈ క్రమంలోనే జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ తండ్రి బోనీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు మరో అదిరిపోయే విషయాన్ని చెప్పారు. అది ఏంటంటే.. త్వరలోనే జాన్వీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం దర్శకుడు సానా బుచ్చిబాబు కాంబోలో వస్తున్న ఆర్‌సీ 16 లో నటించబోతున్నట్లు ప్రకటించారు.
దేవర సినిమాలో తంగం అనే పాత్రలో ఈ బాలీవుడ్ బ్యూటీ కనిపించబోతోంది. ఇదివరకే ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి తరహాలో తన నేచురల్ అందంతో మెస్మరైజ్ చేస్తున్న జాన్వీ దేవరలో మాత్రం చాలా కీలకమైన పాత్రలోనే కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా తంగం పాత్ర మరో పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో కూడా తెలుగు అమ్మాయిలా అందంగా కనిపిస్తున్న జాన్వీ తన నవ్వుతో కట్టిపడేస్తోంది. అందమైన కురులతో చక్కనైన బొట్టుతో.. చీరలో జాన్వీ చాలా అట్రాక్టివ్ గా ఉంది.
Also read: వైసీపీకి బిగ్ షాక్..ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా!