Janhvi Kapoor : పెళ్లి వార్తలపై స్పందించిన జాన్వీ కపూర్.. అదే పనిలో ఉన్నానంటూ!

స్టార్ నటి జాన్వీ కపూర్ త్వరలోనే పెళ్లి పీఠలెక్కబోతున్నట్లు వైరల్ అవుతున్న వార్తలపై స్పందించింది. 'కొన్ని వార్తలు చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది. నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. కానీ నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా' అంటూ క్లారిటీ ఇచ్చింది.

New Update
Janhvi Kapoor : పెళ్లి వార్తలపై స్పందించిన జాన్వీ కపూర్.. అదే పనిలో ఉన్నానంటూ!

Marriage : యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఎట్టకేలకు తన పెళ్లి వార్తలపై (Marriage News) స్పందించింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ (Mr. & Mrs. Mahi) మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమె.. కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జాన్వీ మాట్లాడుతూ.. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పింది. అలాగే ఇటీవల తన పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు చదివానని, నిజంగా తనకే ఆశ్చర్యం వేసిందని చెప్పింది.

ఈ మధ్య నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి రెండు, మూడు కథనాలు మిక్స్‌ చేసి రాశారు. నాకు తెలియకుండానే వారంలో పెళ్లి కూడా చేసేలా ఉన్నారు. నేను ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా అని స్పష్టం చేసింది. అలాగే ఓ నెటిజన్ పోస్ట్ పై రియాక్ట్ అయిన నటి.. ‘ఏదైనా రాస్తారా..’ అని రిప్లై పెట్టారు. ఇక ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె ఇచ్చిన ఫన్నీ రిప్లై వైరల్‌గా మారింది. ‘మనం డేట్‌కు వెళ్దామా? అది మంచి స్టోరీ అవుతుంది’ అని ఓ యూజర్‌ అడగ్గా దానికి జాన్వీ సరదాగా స్పందించారు. ‘నువ్వు గొడ్డలితో నరికి చంపేసే హంతకుడివి అయితే ఎలా?’ అన్నారు. రెడిట్‌ను తనకంటే తన చెల్లి ఖుషీనే ఎక్కువగా వాడుతుందని చెప్పారు. ఇందులో విశేషాలు చెల్లిని అడిగి తెలుసుకుంటానని జాన్వీ వెల్లడించారు. ఇక 'దేవరతో'టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Also Read : స్వదేశానికి చంద్రబాబు.. టీడీపీ నేతల ఘనస్వాగతం

Advertisment
తాజా కథనాలు