/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2-2-jpg.webp)
Janhvi Kapoor in RC16: RRR తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ చిత్రాన్ని చేస్తున్నారు. అయితే గతంలో ఈ డైరెక్టర్ మొదలు పెట్టిన 'భారతీయుడు 2' చిత్రం మళ్ళీ పట్టాలెక్కడంతో.. గేమ్ చేంజర్ (Game Changer) ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో రామ్ చరణ్ ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ ప్రాజెక్ట్ ను ఒకే చేశారు.
Manushi Chillar: బ్లూ డ్రెస్ లో ‘వాలెంటైన్’ బ్యూటీ.. హాట్ ఫోజులు
బుచ్చిబాబు (Buchi Babu) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ ని 'RC16' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీలోని నటీనటుల ఎంపికలు జరుగుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే అంశం పై పలు చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు కూడా తెర పైకి వచ్చాయి.
రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్
అయితే తాజాగా.. RC16 లో రామ్ చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్నట్లుగా తెలిసింది. ఈ విషయాన్నీ జాన్వీ తండ్రి బోనీ కపూర్ స్వయంగా వెల్లడించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బోనీ కపూర్.. "ప్రస్తుతం మా అమ్మాయి ఎన్టీఆర్‌తో దేవరలో (Devara) నటిస్తుంది. మరి కొద్దీ రోజుల్లో రామ్ చరణ్ నటించబోయే సినిమా షూటింగ్ లోనూ పాల్గొంటుంది అని మాట్లాడారు". రామ్ చరణ్ నటించబోయే నెక్స్ట్ సినిమా RC16 కావడంతో.. నెట్టింట్లో ఈ వార్త వైరల్ గా మారింది. ఒకప్పుడు అతిలోక సుందరి శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి జోడీ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు వారి వారసులు తెర పై సందడి చేయబోతున్నారని తెలియడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంద