/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/pawan-2-jpg.webp)
Janasena: విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టైకూన్ కూడలిలో రోడ్డు మూసివేతను నిరసిస్తూ మనోహర్ నేతృత్వంలో జనసేన ధర్నా చేసింది. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రియలెస్టేట్ వ్యాపారంలో భాగంగా నిర్మిస్తున్న కట్టడానికి వాస్తు బాగోలేదని రోడ్డును మూసేశారని ఈ సందర్భంగా మనోహర్ మండిపడ్డారు. వైసీపీ నేతల నిర్మాణాలకు వాస్తు దోషం ఉంటే రోడ్లను మూసేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు. దీంతో విశాఖలోని నొవాటెల్ హోటల్ వద్ద ఆందోళన చేస్తున్న మనోహర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also read: సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా?
దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీరియస్ గా స్పందించారు. విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంటే నిరసన తెలిపిన మా నేత నాదెండ్ల మనోహర్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం అంటూ ధ్వజమెత్తారు. ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. వైసీపీ ఎంపీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తుందని, ఇందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తున్నామని తెలిపారు. నాదెండ్ల మనోహర్ ను, ఇతర నేతలను పోలీసులు తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. 'ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే నేను విశాఖపట్నం బయల్దేరి వస్తాను.. ప్రజల తరఫున పోరాడతాను' అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
శ్రీ @mnadendla గారి అరెస్టు అప్రజాస్వామికం
* ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్టు చేస్తారా?
* శ్రీ మనోహర్ గారితోపాటు, ఇతర నేతలను విడుదల చేయకపోతే విశాఖ వస్తా... పోరాడతా - JanaSena Chief Shri @PawanKalyan#HelloAP_ByeByeYCPpic.twitter.com/MHxhVsZKOk
— JanaSena Party (@JanaSenaParty) December 11, 2023
Follow Us