/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-10.25.41-AM-jpeg.webp)
Janasena : కాకినాడ(Kakinada) జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) గృహప్రవేశం(House Warming) చేయనున్నారు. పండగ వేళ గృహప్రవేశం చేయనున్న ఆయన.. కొత్త ఇంట్లోనే ఉగాది(Ugadi) వేడుకలు జరుపుకోనున్నారు. చేబ్రోలు రామాలయంలో పవన్.. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొనన్నారు. ఆ తర్వాత పిఠాపురం(Pithapuram) ముఖ్యనేతలతో జనసేనాని సమావేశం కానున్నారు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయనున్న పవన్.. జాతీయ రహదారి చేబ్రోలులో కొత్త ఇల్లు నిర్మించారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు పవన్ చేరుకున్నారు.
Also Read: కూటమి అధికారంలోకి వస్తేనే మా జాతికి మేలు.. మందకృష్ణ!
అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా గొల్లప్రోలకు వెళ్లనున్నారు. అనంతరం పిఠాపురానికి చేరుకుకోనున్నారు. పవన్ గృహప్రవేశం కోసం.. అక్కడి స్థానికులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం రావడంతో.. ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమాలు రద్దయ్యాయి. కొన్ని రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కల్యాణ్‌కు జ్వరం రావడంతో.. హైదరాబాద్(Hyderabad) లో చికిత్స తీసుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఈ నెల 5 నుంచి తిరిగి అనకాపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇది ముగిసిన తర్వాత మరోసారి ఆయన అస్వస్థకు గురికావడంతో.. ఎన్నికల కార్యక్రమాలు వాయిదా వేశారు.
చివరగా గాజువాకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్.. జనసేన అభ్యర్థిగా కొణతాల, ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్‌కు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఈ సమయలోనే పవన్ రెండోసారి అనారోగ్యానికి గురయ్యారు. ప్రచార సభ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు బాగా నీరసం వచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు. దీంతో ఆయన హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు. వైద్యుల సూచనల మేరకు కాస్త రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) దగ్గరికొస్తున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓవైపు వైసీపీ, మరోవైపు బీజేపీ-టీడీడీ-జనసేన కూటమిల మధ్య గట్టి పోటీ ఉండనుంది. మే 13 ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: సంచలనంగా వేమిరెడ్డి ప్రశాంతి ఆడియో.!