Pawan Kalyan Vizag Tour: షెడ్యూల్ ప్రకారం పెందుర్తికి పవన్ కళ్యాణ్.. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరామర్శ

జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజక వర్గానికి వెళ్లనున్నారు. అక్కడ వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారితో కొద్దిసేపు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతాన్ని పవన్ సందర్శించనున్నారు.

Pawan Kalyan Vizag Tour: షెడ్యూల్ ప్రకారం పెందుర్తికి పవన్ కళ్యాణ్.. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరామర్శ
New Update

జనసేన పార్టీ షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ విశాఖ పట్నంలోని పెందుర్తి నియోజక వర్గానికి వెళ్లనున్నారు. అక్కడ వలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్దురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. వారితో కొద్దిసేపు మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అలాగే అక్కడ చుట్టుపక్కల ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాఖ నగరంలో సీఎన్‌బీసీ ల్యాండ్స్ ప్రాంతాన్ని పవన్ సందర్శించనున్నారు.

కాగా విశాఖపట్నంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి విశాఖలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ పర్యటించనున్నారో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేశారు. నేటి నుంచి 17వ తేదీ వరకూ వైజాగ్ లో ఈ యాత్ర కొనసాతుందని వెల్లడించారు.

రుషికొండ పర్యటనపై ఉత్కంఠ:

ఇక శుక్రవారం పవన్ కళ్యాణ్ రుషికొండ పర్యటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదట రుషికొండ, ఎర్రమట్టి దిబ్బల సందర్శనకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా వెళ్లి తీరతానని చెప్పారు. దీంతో కాసేపు నోవాటెల్ హోటల్ వద్ద హైడ్రామా కొనసాగింది. ముందస్తుగానే పోలీసులు హోటల్ వద్ద మోహరించారు. ఎట్టకేలకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో నోవాటెల్ హోటల్ నుంచి బయటకు వచ్చారు పవన్. వారాహి వెహికల్ తో పాటు మరో 7 వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కు నోటీసులు:

మరోవైపు పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారాహి విజయయాత్రలో భాగంగా జగదాంబ సెంటర్‌లో జరిగిన సభలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ విశాఖ తూర్పు ఏసీపీ మూర్తి నోటీసుల్లో పేర్కొన్నారు. బహిరంగ సభలో పవన్ నిబంధనలు ఉల్లంఘించారని, సభల్లో బాధ్యతగా మాట్లాడాలని తెలిపారు. వాలంటీర్లు, ఆంధ్రా యూనివర్సిటీపై ఆరోపణలు చేసినందకు గాను సెక్షన్ 30 కింద నోటీసులు జారీచేశామని తెలిపారు.

పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ షెడ్యూల్ వివరాలు:

• 13న గాజువాక నియోజకవర్గంలో బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు.

• 14న ఉదయం 11 గంటలకు అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని విస్సన్నపేటకు ఆక్రమణకు గురైన భూముల సందర్శిస్తారు

• 15న మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకానున్న జనసేనాధిపతి

• 16న మళ్లీ విశాఖకు వచ్చి భీమిలి నియోజకవర్గంలో ధ్వంసానికి గురవుతున్న ఎర్రమట్టి దిబ్బల సందర్శిస్తారు

• 17న విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

#janasena-chief-pawan-kalyan #pawan-kalyan-vizag-tour #pawan-kalyan #janasena #pendurthi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe