JanaSena VeeraMahila : స్త్రీ అన్ని విధాలా దగాకి గురవుతుందనేది వాస్తవం: పవన్ కళ్యాణ్

ఆగష్టు 15 సందర్భంగా జనసేన వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజలందరికీ జనసేన పక్షాన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మహానుభావులు, మేధావుల త్యాగాలతోనే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని చెప్పారు. ఇటువంటి చరిత్రలు, మహానుభావులు త్యాగాలు అందరూ తెలుసుకోవాలని సూచించారు. అలాగే పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించాలని కోరుకుంటున్నాని చెప్పారు. తాము భవిష్యత్తులో మగువలకు సరైన స్థానం, రక్షణ కల్పిస్తామని చెప్పారు. అతని ఇంట్లో ఆడవాళ్లు, కుటుంబం ఉంది కదా అని గుర్తు చేశారు. స్త్రీల కట్టు, బొట్టును అవమానించినా ప్రభుత్వం పట్టించుకోదా అని... ఈ పాలకులకు రాజకీయమే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదన్నారు. దిశ చట్టాలు, స్పందన పెట్టి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. . సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, పొట్టి శ్రీరాములు వంటి వారి స్పూర్తి తో జనసేన బలంగా పోరాటాలు చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

New Update
Pawan Kalyan: ఏపీ క్రైమ్ కి అడ్డాగా మారిపోయింది.. సీఎం పదవికి రెడీగా ఉన్నాను: పవన్ కళ్యాణ్

Pawan Kalyan Meeting With JanaSena Veera Mahila: ఆగష్టు 15 సందర్భంగా జనసేన వీర మహిళలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సమావేశమయ్యారు. ప్రజలందరికీ జనసేన పక్షాన స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మహానుభావులు, మేధావుల త్యాగాలతోనే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామని చెప్పారు. ఇటువంటి చరిత్రలు, మహానుభావులు త్యాగాలు అందరూ తెలుసుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో స్త్రీల పాత్ర గురించి పెద్దగా మాట్లాడటం లేదని.. వీర మహిళలు, ఆడపడుచుల ఆశీస్సులు లేకుండా పార్టీని నడపలేమన్నారు పవన్ కళ్యాణ్. అలాగే పేద, మధ్య తరగతి మహిళలు ఇంటికే పరిమితం కాకూడదని.. సమాజంలో తమ మేధస్సుతో రాణించాలని కోరుకుంటున్నాని చెప్పారు. ప్రజల కోసం అమలు చేసే పథకాలు మొత్తం పాలకుల పేర్లేనా అని నిలదీశారు.

భారతదేశం చాలా సంపద ఉన్న దేశం కాబట్టే బ్రిటీష్ వారు మనపైనే దండెత్తారన్నారు పవన్ కళ్యాణ్. దేశం కోసం చేసిన పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. పాకిస్తాన్ విభజన సమయంలో ముస్లింలు, హిందువులు నలిగిపోయారన్నారు. రజాకర్ల సమయంలో ఊచకోతలు జరిగాయని అన్నారు పవన్. కులాలు, మతాలు, తెగల గొడవల్లో స్త్రీని అవమానిస్తున్నారన్నారు. ఎక్కడా ఎటువంటి ఘర్షణలు జరిగినా స్త్రీ అన్యాయం అయిపోతుందన్నారు. మణిపూర్ ఘటనలో జరిగిన ఘోరాలు చూశామని.. స్త్రీ అన్ని విధాలా దగాకి గురవుతుందనేది వాస్తవమని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడ పిల్లలు అదృశ్యం అయితే ఇప్పటివరకూ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కనీసం వీటిపై ఈ సీఎం (CM Jagan) సమీక్ష చేయలేదని దుయ్యబట్టారు. ఆంధ్ర ప్రదేశ్ లో మహిళలపై దాడులు, దారుణాలు జరుగుతున్నాయన్నారు. జనసేన పక్షాన మహిళలకు అండగా నిలబడతామని స్పష్టం చేశారు. జనసేన వీర మహిళపై వైసీపీ (YCP) నాయకుడు చాలా ఘోరంగా మాట్లాడారన్నారు. అధికారం ఉందనే అహంకారంతో.. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాగారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము భవిష్యత్తులో మగువలకు సరైన స్థానం, రక్షణ కల్పిస్తామని చెప్పారు. అతని ఇంట్లో ఆడవాళ్లు, కుటుంబం ఉంది కదా అని గుర్తు చేశారు. స్త్రీల కట్టు, బొట్టును అవమానించినా ప్రభుత్వం పట్టించుకోదా అని... ఈ పాలకులకు రాజకీయమే ముఖ్యమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు, మహిళా కమీషన్ మాట్లాడదన్నారు. దిశ చట్టాలు (Disha Act), స్పందన (Spandana) పెట్టి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. . సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose), అంబేద్కర్ (Ambedkar), పొట్టి శ్రీరాములు వంటి వారి స్పూర్తి తో జనసేన బలంగా పోరాటాలు చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

అంతకు ముందు.. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ ఘనంగా నిర్వహించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన (Janasena) రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించగా.. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్​ తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ నేతలు జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.

Also Read: జగన్‌ పాదం పెడితే..విశాఖ సర్వనాశనం!

Advertisment
Advertisment
తాజా కథనాలు