/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/PAWAN-KALYAN-jpg.webp)
Janasena Election Coordination Committee: పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. తెలంగాణలో (Telangana) మే 13న ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేనకు అతి తక్కువగా ఓట్ల వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున సమన్వయం కోసం ఓ కమిటీని నియమించారు. శుక్రవారం మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటిలో అయిదుగురు సభ్యులు ఉంటారు. దీనికి పార్టీ ఉపాధ్యాక్షులు బొంగునూరి మహేంధర్ రెడ్డి సమన్వయకర్తగా పనిచేస్తారు.
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల సమన్వయ కమిటీ నియామకం
సమన్వయకర్తగా శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డి
జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ గా శ్రీ సాగర్ pic.twitter.com/DXJhyptis9
— JanaSena Party (@JanaSenaParty) April 12, 2024
Also Read: షర్మిల పర్యటనను అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు.. అవినాష్ రెడ్డికి గట్టి కౌంటర్