Peddireddy Ramachandra Reddy: జనసేన-టీడీపీ పొత్తు కొత్తేంకాదు టీడీపీ-జనసేన పొత్తులు కొత్తేంకాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. By Karthik 15 Sep 2023 in తిరుపతి రాజకీయాలు New Update షేర్ చేయండి టీడీపీ-జనసేన పొత్తులు కొత్తేంకాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు బీజేపీతో కలిసి వెళ్తున్నట్లు, టీడీపీతో ఎలాంటి సంబంధం లేనట్లు వ్యవహరించిన పవన్ ఇప్పుడు టీడీపీతో ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారన్నారు. దీంతో బీజేపీ వస్తే మాతో రావాలని లేకుంటే తానే బీజేపీని వదిలేస్తానే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో బీజేపీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని మంత్రి వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు బుద్దులు వచ్చాయని పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సొంత మామను నమ్మించి వెన్నుపోటు పొడిచారన్న ఆయన.. పవన్ ఇన్ని సంవత్సరాలు బీజేపీని నమ్మించి వెన్నుపోటు పోడిచారని విమర్శించారు. కాగా చంద్రబాబుతో ములాఖత్ అనంతరం పవన్ ప్రేస్ మీట్‌లో చేసిన కీలక వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారన్నారు. చంద్రబాబు జైల్లో కూర్చొని పవన్ అనే పెయిడ్ ఆర్టిస్ట్‌తో రాజకీయాలు చేయిస్తున్నారన్నారు. జైల్లో కూర్చొని డైరెక్టర్ వ్యూహాలు రచిస్తుంటే.. బయట ఆర్టిస్ట్ ఆ వ్యూహాలను అమలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సూచన మేరకే పవన్ వారాహి యాత్రలు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. పవన్ తన యాత్రలో ప్రజలను ఎలా రచ్చగొట్టాలో తెలియక చంద్రబాబు సలహాలు తీసుకున్నారన్నారు. చంద్రబాబు సలహాలతో ముందుకు పోయినా పవన్ రాష్ట్రంలో ఎలాంటి హింసను సృష్టించలేకపోయారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మోసాలు బయటబడ్డాయన్న మంత్రి.. రానున్న రోజుల్లో లోకేష్ చేసిన మోసాలు కూడా బయటపడే ఛాన్స్ ఉందన్నారు. లోకేష్ సైతం తండ్రితో కలిసి రాజమండ్రి జైల్లోనే కూర్చోవాల్సి వస్తుందని మంత్రి పెద్దిరెడ్డి జోస్యం చెప్పారు. #pawan-kalyan #chandrababu #ysrcp #jana-sena-tdp #alliance #minister-peddireddy #tdp-jana-sena #paid-artist మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి