James Anderson Announces Retirement: ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మెట్ల క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వెస్టిండీస్ తో లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ తన చివరిదని తెలిపాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. '20 ఏళ్లుగా నా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడే ఆటను ఆస్వాదించాను. ఇంగ్లండ్‌కి (England) వాకింగ్ అవుట్ చేయడం చాలా మిస్ అవుతున్నాను. రాబోయే తరం కలలను సాకారం చేసుకోవడానికి నేను తప్పుకోవడం సరైన సమయమని భావిస్తున్నారు. ఇంతకంటే గొప్ప అనుభూతి లేదు' అని అన్నాడు.
మూడవ బౌలర్ గా..
41 ఏళ్ల అండర్సన్ 2002లో ఇంగ్లాండ్ తరఫున తొలిసారి బరిలోకి దిగిన అండర్సన్.. కీలక ప్లేయర్‌గా మారిపోయాడు. ఇప్పటివరు 187 టెస్టులు, 194 వన్డేలు, 19 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవల భారత్ తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 700 టెస్ట్ వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 700ల వికేట్లు తీసిన మొదటి పేసర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వికెట్లు తీసిన వారిలో ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708)తర్వాత మూడవ బౌలర్ గా నిలిచాడు. మొత్తంగా అత్యధిక వికెట్లు తీసిన వారితో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్ తర్వాత మూడవ బౌలర్ గా నిలిచాడు. ఇక మొత్తం అన్ని ఫార్మెట్లు కలిపి 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అండర్సన్ 987 వికెట్లు తీశాడు. 2015 ప్రపంచ కప్‌లో తన చివరి వన్డే ఆడిన అండర్సన్ వన్డేల్లో 269 వికెట్లు తీసుకున్నాడు.
నా తల్లిదండ్రుల ప్రేమ, మద్దతు లేకుండా నేను ఇంత దూరం ప్రయాణించలేదు. వారికి కృతజ్ఞతలు. అలాగే నన్ను ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దిన ఆటగాళ్లు, కోచ్‌లకు ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలుగా నాకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా ముందున్న కొత్త సవాళ్లను స్వీకరించేందుకు సంతోషంగా ఎదురుచూస్తున్నా అన్నాడు.
Also Read: ముంబై ను వీడుతున్నా.. రోహిత్ శర్మ..ఆడియో బయటపెట్టిన కేకేఆర్ జట్టు