Jaggery Purity Checking: ఆరోగ్యానికి చెక్కర ఉత్తమమా? బెల్లం మంచిదా? అంటే మొహమాటం లేకుండా బెల్లం(Jaggery) అని సమాధానం చెబుతారు ఆరోగ్య నిపుణులు. చెక్కర వినియోగం వల్ల అనారోగ్య(Health) సమస్యల వస్తాయి. అదే బెల్లం వినియోగంతో.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఆ కూడా బెల్లం అసలైనదైతేనే.. ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. లేదంటే.. ఈ బెల్లం కూడా అనారోగ్యానికి కారణం అవుతుంది. మరి మీరు తినే బెల్లం అసలైనదా? కల్తీ చేసిందా? మరి కల్తీ చేసిన బెల్లాన్ని ఎలా గుర్తించాలో ఈ కథనంలో తెలుసుకోండి..
చలికాలంలో బెల్లం ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే, మీరు తినే బెల్లం స్వచ్ఛమైనదేనా? లేక కల్తీ చేసిందా? అనేది ముందే తెలుసుకోవాలి. తద్వారా మీ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. బెల్లం ఆరోగ్య ప్రదాయిని అని ఆయుర్వేద నిపుణులు అంటారు. అందుకే బెల్లానికి మార్కెట్‌లో ఫుడ్ డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. బెల్లంను కల్తీ చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్ మొత్తం కల్తీ బెల్లం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. ఈ చలికాలంలో మీరు కూడా బెల్లం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? స్వచ్ఛమైన బెల్లంను ఎలా గుర్తించాలో ఇవాళ మనం తెలుసుకుందాం.
Also Read: విశాఖలో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా.. యువకుడు స్పాట్ డెడ్..
నకిలీ బెల్లంను ఇలా తయారు చేస్తారు..
బెల్లం మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, జింక్, ప్రొటీన్, విటమిన్ బి వంటి పోషకాలు బెల్లంలో పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం ద్వారా శరీరంలో కాస్త వెచ్చదనం కలుగుతుంది. అందుకే.. దీనిని చలికాంలో ఎక్కువగా తింటారు. అయితే, వ్యాపారమే పరమావధిగా బెల్లంను కల్తీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. బెల్లంను కాల్షియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్‌తో కల్తీ చేస్తున్నారు. ఇది శరీరానికి చాలా హనీ కలిగిస్తుంది. ఇక బెల్లానికి సరైన రంగు వచ్చేందుకు.. సోడియం బైకార్బోనేట్ కలుపుతున్నారు. తద్వారా ఇది చూసేందుకు అసలైన బెల్లం మాదిరిగా ఉంటుంది.
ఈ రంగులో ఉన్న బెల్లంనే కొనుగోలు చేయండి..
మీరు బెల్లంను కొనుగోలు చేయాలనుకుంటే.. గోధుమ రంగులో ఉన్న బెల్లంను కొనుగోలు చేయండి. పసుపు లేదా లేత గోధుమ రంగులో ఉన్న బెల్లంలో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాటిని కొనుగోలు చేయొద్దు. చెరకు రసాన్ని ఎక్కువసేపు మరిగించడం ద్వారా అందులో రసాయనిక మార్పులు చోటు చేసుకుంటాయి. దీని కారణంగా బెల్లం రంగు ముదురు ఎరుపు, గోధుమ రంగులోకి మారుతుంది.
నకిలీ బెల్లం రంగు..
మార్కెట్‌లో తెలుపు, లేత పసుపు, ఎరుపు (మెరిసే) రంగుల్లో నకిలీ బెల్లం అందుబాటులో ఉంటుంది. దీనిని కొనుగోలు చేసినట్లయితే.. కల్తీ చేసిన బెల్లం పదార్థాలు పాత్ర దిగువన పేరుకుపోతాయి. అయితే స్వచ్ఛమైన బెల్లం పూర్తిగా నీటిలో కరిగిపోతుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అందించడం జరిగింది. దీనిని ఆర్టీవీ తెలుగు ధృవీకరించడం లేదు.
Also Read: ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగం.. మిషన్ గగన్‌యాన్‌లో తొలి ప్రయోగం