/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-26T170503.383.jpg)
అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో దీనిపై చర్చలు జరిపారని తెలిపారు. షర్మిలను కాంగ్రెస్ నుంచి బయటకు పంపితే వైసీపీని విలీనం చేస్తానని జగన్ అన్నారంటూ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఆరోపణలపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. మళ్లీ గెలిచేవరకు జగన్ తాడేపల్లిలోనే ఉంటారని.. ఆయన ఎవరికీ భయపడే రకం కాదని పేర్ని నాని అన్నారు.
తమ 11మంది ఎమ్మెల్యే 4 గురు MP లలోఎంత మంది కూటమి వైపు చూస్తున్నారో అర్ధం కాని పరిస్థితులలో నిన్న రాత్రి బెంగళూరులో డీ.కే.శివ కుమార్ తో భేటీ అయిన వై.ఎస్. జగన్ , షర్మిలను కాంగ్రెస్ నుండి తొలగిస్తే వైస్సార్సీపీ ని కాంగ్రెస్ లోకి విలీనం చేస్తామన్నట్లు వార్తలు వస్తున్నాయి pic.twitter.com/tbED8cq4Fi
— Nallamilli Ramakrishna Reddy (@MeeNallamilli) June 25, 2024