Achchennaidu: జగన్‌ పెద్ద అవినీతి పరుడు.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్ద అవినీతి పరుడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అవినీతి పరుడు తమ నేతపై తప్పుడు కేసులు పెట్టించాడని విమర్శించారు. జగన్‌ నుంచి ఎప్పుడూ అబద్దాలే వస్తాయని, ఆయన నోటి నుంచి ఎన్నడూ నిజాలు రావన్నారు.

TDP: వారిపై కఠిన చర్యలు తీసుకోండి..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అచ్చెన్నాయుడు లేఖ..!
New Update

సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పెద్ద అవినీతి పరుడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అవినీతి పరుడు తమ నేతపై తప్పుడు కేసులు పెట్టించాడని విమర్శించారు. జగన్‌ నుంచి ఎప్పుడూ అబద్దాలే వస్తాయని, ఆయన నోటి నుంచి ఎన్నడూ నిజాలు రావన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలొ ఎలాంటి అభివృద్థి జరగలేదని, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలు కూడా జగన్‌ కండీషన్‌ల వల్ల వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. జగన్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ సదస్సుకు వెళ్తే అతన్ని పట్టించుకున్న నాదుడే లేడన్నారు.

పక్క రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు సమావేశం అవుతుంటే జగన్‌ నోరెల్లబెట్టి చూశారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రాష్ట్రం ఇంతలా దివాలా తీస్తే ఏ పరిశ్రమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని సుమారు 50 వేల కోట్లను దోచుకున్న జగన్‌ పెట్టుబడులను ఏవిధంగా తీసుకువస్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి బారత రాజ్యాంగంపై, కోర్టులపై నమ్మకం లేదన్నారు. ఈ ఆర్థిక ఉగ్రవాది అవినీతి గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాకపోవడంతో జగన్‌ తన సొంత సంస్థలను రాష్ట్రంలో స్థాపించారన్నారు. ఇందులో భాగంగానే వివిధ పేర్లతో మద్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చారన్నారు. అంతే కాకుండా ఆయనకు చెందిన సిమెంట్‌ ఫ్యాక్టరీలను విస్తరించుకున్నారని, విద్యా సంస్థలను విస్తరించుకున్నారన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెట్టుబడులపై విపక్షాలు ప్రశ్నిస్తే.. తన పరిశ్రమలను చూపించుకోవచ్చని జగన్‌ ఈ ప్లాన్‌ వేశారని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

#ycp #tdp #cm-jagan #corruption #achchennaidu #pettubudulu #sotham #factories #50-thousand-crores
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe