జగన్ ప్రభుత్వానికి షాక్‌..టీటీడీ ట్రస్ట్ సభ్యులకు హైకోర్టు నోటీసులు!

టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్‌ నికేతన్, శరత్‌ చంద్రారెడ్డి లను ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరి నియామకం గురించి సవాలు చేస్తూ మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ వేశారు.

AP IRR Case: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారాయణ అల్లుడికి హైకోర్టు షాక్
New Update

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో పెద్ద షాక్ తగిలింది. ఏపీ ప్రభుత్వం టీటీడీ ట్రస్ట్ బోర్డ్‌ సభ్యులుగా నియమించిన కొందరి నియామకం పై సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన మాజీ రైల్వే ఉద్యోగి ఒకరు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని గురించి ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.

అసలేం జరిగిందంటే... టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులుగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్‌ నికేతన్, శరత్‌ చంద్రారెడ్డి లను ఏపీ ప్రభుత్వం నియమించింది. వీరి నియామకం గురించి సవాలు చేస్తూ మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. దీని గురించి పిటిషనర్‌ తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌ కుమార్‌ బుధవారం న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్న వారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. దీని గురించి జస్టిస్‌ రఘునందరావు ధర్మాసనం ప్రభుత్వాన్ని వివరణ కోరింది. అయితే వారు నేరస్థులు కాదు అని..వారి మీద ఇంకా నేరాలు రుజువు కాలేదని..కేవలం వారి మీద కేసులు మాత్రమే నమోదు అయ్యాయని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు.

కేథన్ దేశాయ్ ను ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్‌ కౌన్సిల్ నుంచి తొలగించారు. ఆయనను ఎలా టీటీడీ సభ్యుడిగా నియమించారని న్యాయవాది శ్రావణ్‌ ధర్మాసనం దృష్టికి తీసుకుని వచ్చారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ లో శరత్‌ చంద్రారెడ్డి ఉన్నారని, ఎమ్మెల్యే ఉదయభాను మీద కూడా క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు.

దీని గురించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడంతో పాటు..నెక్ట్స్‌ విచారణకు మూడు వారాల వాయిదా వేసింది. అలాగే టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డిలకు వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది.

#ap #ttd-trust #high-court #ycp #members
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe