Telangana Election 2023: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్‌: కోదండరామ్

బీఆర్ఎస్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే.. ప్రజా అనుకూల విధానాలను సాధించే ప్రయత్నం చేసి ప్రభుత్వం దాడులు చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు.

New Update
Telangana Election 2023: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్ట్‌: కోదండరామ్

JAC president Professor Kodandaram: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆదివారం జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్లు ఇరిగేషన్‌పై ఖర్చుపెట్టిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు.. కాంట్రాక్టర్ల ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ అయ్యిందని కోదండరామ్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులో 25 వేల కోట్లు గల్లంతయ్యాయి ఆయన ఆరోపించారు. మూడు బ్యారేజీలు మేడిగడ్డ అన్నారం. సుందిళ్ళ పనికిరాకుండా పోయాయి అని విమర్శలు చేశారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ కట్టినప్పుడు గ్రామస్తుల దగ్గర తక్కువ డబ్బులకే భూములు గుంజుకున్నారని.. వారికి న్యాయం జరగకుండానే రాత్రిపూట కొట్టి బుల్డోజర్లతో కూల్చి గ్రామాన్ని ఖాళీ చేయించారని కోదండరామ్ గుర్తుచేశారు.

ఈ గవర్నమెంట్ కొట్టుకుపోతుంది

కానీ.. ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు..? అని కోదండరామ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మళ్లీ గెలిస్తే చిప్ప చేతికి వస్తది ఎద్దేవా చేశారు. తెలంగాణను సరి చేసుకోవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామిక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడాలని కాంగ్రెస్‌కు జేఏసీ పక్షాన కొన్ని డిమాండ్లతో సంపూర్ణ మద్దతు తెలిపామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కొట్టుకపోతుందో ఈ గవర్నమెంట్ కూడా అలాగే కొట్టుకుపోతుంది కోదండరామ్ ధ్వజమెత్తారు. రాక్షస పాలన అంతం చేయడానికి మనం పూనుకుందాం.. గెలవలసింది నువ్వు.. నేను.. కాదు గెలవలసింది తెలంగాణ ప్రజలన్నారు. హుస్నాబాద్ నుంచి ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్‌ను గెలిపించుకోవాలని కోదండరామ్ కోరారు.

JAC president Professor Kodandaram media conference in Siddipet district Husnabad

తెలంగాణ కోసం ప్రాణత్యాగం

తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలని.. ఉద్యోగ, ఉపాధి కల్పనపైన ప్రధానమైన దృష్టి పెట్టాలని కోదండరామ్ చెప్పారు. ప్రభుత్వ ఖాళీలను క్యాలండర్ ప్రకారంగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కౌలు రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని కోదండరామ్ కోరారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం పరిపాలన సాగాలని ఆయన కోరారు. ఉద్యమ కారుల సంక్షేమం కోసం బోర్డు పెట్టాలని కోరారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన పిల్లలకు సమగ్ర సహాయం అందించాలని కోదండరామ్ తెలిపారు. ప్రజాస్వామిక పునాదులు, విలువల మీద తెలంగాణను అభివృద్ధి చేయాలని కోదండరామ్ అన్నారు. ఎంతోమంది బలిదానాలాపై ఏర్పడిన తెలంగాణలో ప్రజాస్వామిక పాలన రావాలన్నారు. నిరంకుశ పాలన అంతమొందించి ప్రజాస్వామిక పాలన రావాలని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామని ఆయన చెప్పారు. జేఏసీ తరుపున ఎజెండాను ప్రతిపాదించామని.. ఆ ఏజండాను కాంగ్రెస్ పార్టీ ఆమోదించిందని కోదండరామ్ తెలిపారు.

ఇది కూడా చదవండి: జగన్ నమ్మించి మోసం చేశారు.. మీ భవిష్యత్‌కి టీడీపీ గ్యారంటీ: కందికుంట వెంకటప్రసాద్‌

Advertisment
తాజా కథనాలు