Jabardasth : జబర్దస్త్ లేడీ కమెడియన్ సీమంతం.. వైరలవుతున్న ఫొటోలు

జోర్దార్ సుజాత ఇటీవలే 'సేవ్ ది టైగర్స్' వెబ్ సీరీస్ సక్సెస్ తో ఫుల్ పాపులరైంది. అయితే తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు సుజాత తల్లి కాబోతుందని.. అవి సీమంతం కోసం తీయించుకున్న ఫొటోలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jabardasth : జబర్దస్త్ లేడీ కమెడియన్ సీమంతం.. వైరలవుతున్న ఫొటోలు
New Update

Lady Comedian : బుల్లితెర నటి జోర్దార్ సుజాత(Jordar Sujatha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలంగాణ(Telangana) యాస పై మంచి పట్టున్న ఈ అమ్మడు.. ' జోర్దార్ ' అనే షోలో తనదైన స్లాంగ్ లో వార్తలు చదివి ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది . ఆ తర్వాత 'జోర్దార్' సుజాతకు ఫుల్ పాపులరైన ఈమె బిగ్ బాస్ సీజన్ 4(Bigg Boss Season 4) లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది.

Also Read: Kumari Aunty: కుమారి ఆంటీ మెడలో స్వర్ణ హారం.. ధర తెలిస్తే మైండ్ బ్లాకే..!

ఆ షో ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకున్న సుజాత ఇటు టీవీ షోస్, అటు సినిమాలు చేస్తూ బిజీగా సాగుతోంది. ఇటీవలే 'సేవ్ ది టైగర్స్' వెబ్ సీరీస్ లో ప్రియదర్శి సరసన నటించిన ఈ అమ్మడు తన మాట తీరు, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

తల్లి కాబోతున్న సుజాత

Jordar Sujatha

ఇది ఇలా ఉంటే.. తాజగా సుజాతకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరలవుతోంది. ఇందులో ఆమెకు సీమంతం(Baby Shower) జరిగినట్లుగా కనిపిస్తుంది. దీంతో సుజాత తల్లి కాబోతుందని .. అవి సీమంతం కోసం తీయించుకున్న ఫోటోలే అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు. కానీ దీని పై సుజాత, రాకేష్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇకపోతే జబర్దస్త్ చేస్తున్న సమయంలో సుజాత, రాకేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read: Save The Tigers Series: ఓటీటీలో ‘సేవ్‌ ది టైగర్స్‌’ హవా .. ఇండియాలోనే టాప్ 3 సీరీస్ గా రికార్డు..!

#baby-shower #jordar-sujatha #jabardasth-comedy-show #bigg-boss-season-4
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి