టీటీడీ చైర్మన్ గా ఎమ్మెల్యే భూమన నియామకంపై ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు

హిందూ ధర్మంపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులనే టీటీడీ చైర్మన్ గా నియమించాల్సి ఉందని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లను ఆ పోస్ట్ కు ఐవైఆర్ కృష్ణారావు జత చేశారు. ఇది రాజకీయ పోస్టింగ్ గా మారడం దురదృష్టకరమన్నారు. హిందూ ధర్మ సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించినా తమను అడ్డుకునేవారు లేరనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని..

New Update
టీటీడీ చైర్మన్ గా ఎమ్మెల్యే భూమన నియామకంపై ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై టీటీడీ మాజీ ఈవో ఐవైఆర్ కృష్ణారావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో ఐవైఆర్ కృష్ణారావు ఓ పోస్ట్ చేశారు.

హిందూ ధర్మంపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులనే టీటీడీ చైర్మన్ గా నియమించాల్సి ఉందని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లను ఆ పోస్ట్ కు ఐవైఆర్ కృష్ణారావు జత చేశారు. ఇది రాజకీయ పోస్టింగ్ గా మారడం దురదృష్టకరమన్నారు.

హిందూ ధర్మ సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించినా తమను అడ్డుకునేవారు లేరనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎంత త్వరగా హిందూ ధర్మ సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీని తప్పిస్తే, హిందూ ధర్మానికి అంత మంచిది అంటూ సూచించారు ఐవైఆర్ కృష్ణారావు.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన చైర్మన్ గా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి స్థానంలో.. కరుణాకర్ రెడ్డి కొత్తగా బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి పదవీకాలం ఈ నెల 8వ తేదీతో ముగియనుంది. దీంతో కొత్త చైర్మన్ ను సీఎం జగన్ ఎంపిక చేశారు. కాగా తనను టీటీడీ చైర్మన్ గా నియమించినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి.

టీటీడీ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించడం ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి ఇది రెండో సారి. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2006 నుంచి 2008 మధ్య చైర్మన్ గా పని చేశారు ప్రస్తుతం టీటీడీలో ఛైర్మన్ సహా 35 మంది పాలకమండలి సభ్యులు ఉన్నారు. బీసీ నేతకు టీటీడీ చైర్మన పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డికే చైర్మన్ పదవి దక్కింది. దీంతో కరుణాకర్ రెడ్డి వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి వాసిగా కరుణాకర్ రెడ్డికి మరోసారి శ్రీవారికి సేవ చేసే అవకాశం దక్కిందని అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు