Telangana: తెలంగాణలో మరో నాలుగు రోజుల తేలికపాటి నుంచి ఓ మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు.
గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు సమాచారం.
శుక్రవారం నుంచి శనివారం వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణశాఖ వివరించింది.
శనివారం నుంచి సోమవారం వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: అలర్ట్..గ్రూప్–1 మెయిన్స్ పరీక్ష వాయిదా