Telangana News: వివేక్ అనుచరుల ఇళ్లలో రూ.8 కోట్లు సీజ్ చేసిన ఐటీ అధికారులు.. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్, ఆయన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. అయితే అధికారులు ఆసిఫాబాద్ జిల్లాలోని ఆయన అనుచరుల ఇళ్లలో రూ. 8 కోట్లు సీజ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి కుట్రతోనే తనపై ఐటీ దాడులకు పాల్పడ్డాయని వివేక్ ఆరోపించారు. By B Aravind 21 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి మరికొన్ని రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) రైడ్స్ కలకలం రేపుతున్నాయి. అయితే తాజాగా మంగళవారం తెల్లవారుజాము నుంచి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి, ఆయన అనుచరులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. అయితే సాయంత్రం నాటికి ఈ సోదాలు ముగియగా.. వివిక్ అనుచరుల ఇళ్లలో అధికారులు డబ్బులు సీజ్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో రూ.8 కోట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వివేక్ పై ఎన్నికల సంఘం, ఈడీకి ఫిర్యాదు చేశారు. డబ్బు సంచులతో చెన్నూరుకు వస్తున్నారని.. నేతలను కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బాల్క సుమన్ ఫిర్యాదు నేపథ్యంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. Also Read: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ.. నిర్మల సంచలన వ్యాఖ్యలు! అయితే ఐటీ దాడులు జరిగిన అనంతరం వివేక్ స్పందించారు. బీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ ఫిర్యాదు చేయడంతోనే తనపై ఐటీ దాడులు జరిగాయని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవలేకే బీజేపీ, బీఆర్ఎస్‌లు కలిసి తమపై కుట్ర చేసి ఐటీ దాడులకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఐటీ దాడులు చేసే దమ్ము లేదు కానీ నాపై చేశారంటూ ధ్వజమెత్తారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి మరీ దాడులు చేశారంటూ ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 80 స్థానాల్లో గెలుస్తుందని.. చెన్నూరు నుంచి తానే గెలవనున్నాని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాల్లోకి భారీగా నగదు జమ కావడం గురించి ఐటీ అధికారులు వివేక్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీని వీడిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. #telugu-news #telangana-news #telangana-elections-2023 #vivek-venkataswami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి