IT Raids: హైదరాబాద్‌ పాతబస్తీలో ఐటీ రైడ్స్ కలకలం.. ఈసారి టార్గెట్‌ ఎవరంటే

హైదరాబాద్‌లోని పాతబస్తీలో కింగ్స్ ప్యాలెస్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్‎తో పాటు, పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

New Update
IT Raids: హైదరాబాద్‌ పాతబస్తీలో ఐటీ రైడ్స్ కలకలం.. ఈసారి టార్గెట్‌ ఎవరంటే

తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో వరుసగా ఐటీ రెయిడ్స్ జరగడం కలకలం రేపుతోంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం పాతబస్తిలో బడా వ్యాపారులే టార్గెట్‎గా ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కింగ్స్ ప్యాలెస్ గ్రూప్స్ ఎండీ మజీద్ ఖాన్‎తో పాటు పాతబస్తీలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇవాళ తెల్లవారు జామునే ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. వీరంతా కొహినూర్, కింగ్స్ గ్రూప్స్ పేరుతో ఫంక్షన్ హాల్స్, హోటల్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

Also read: ‘నేను రాను బిడ్డో సర్కార్‌ దవాఖానాకు’.. అంటూ కాంగ్రెస్ పై హరీష్ సెటైర్లు!

ఈ నేపథ్యంలో వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‎గా మారింది. శాస్త్రి పురం , మలక్ పేటలో ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. తాండూరులోని దుర్గ హోటల్‎లో బస చేసిన కింగ్స్ గ్రూప్ యజనిని ఆ హోటల్ లోనే ఐటి అధికారులు ప్రశ్నించారు. ఉదయం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు.. రెండు గంటల పాటు చేసిన సోదాల్లో పలు కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ ఎంతో మేలు.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు