AI City Of Hyderabad : సాంకేతిక రంగంలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) రంగం రోజురోజుకు దూసుకుపోతుంది. ఇక భవిష్యత్తు మొత్తం ఏఐ సాంకేతికత మీదే ఆధారపడి ఉంటుందని ఇప్పటికే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఏఐకి సంబంధించి ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) కీలక వ్యాఖ్యలు చేశారు. అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోసం హైదరాబాద్(Hyderabad) లో 200 ఎకరాలు కేటాయించామని చెప్పారు. ఏఐ రాకతో సాఫ్ట్‌వేరు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని.. భవిష్యత్తులో ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
Also Read: రాష్ట్రంలో ‘ఆర్’ ట్యాక్స్, ‘బీ’ ట్యాక్స్.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు
మొదటి స్థానమే లక్ష్యం
ప్రస్తుతం భారత్(India) లో రెండో స్థానంలో ఉన్న హైదరాబద్‌ను మొదటి ర్యాంకుకు తీసుకెళ్లడమే తన టార్గెట్ అని వెల్లడించారు. తాజాగా హైదరాబాద్‌లోని సైబర్ టైవర్స్(Cyber Towers) లో పీసీఆర్ గ్లోబల్ డెలివరీ సెంటర్ టెక్ హబ్‌ను ప్రారంభించిన మంత్రి.. ఈ ఏడాది జులైలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సదస్సు నిర్వహిస్తామని ప్రకటించారు. ఏఐ సీటీ కోసం 200 ఎకరాలు కేటాయించామని.. ఈ రంగంలో విస్తృతమైన పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిత్సామని తెలిపారు.
భవిష్యత్తులో అపారమైన అవకాశాలు
సాఫ్ట్‌వేర్ రంగాన్ని రాష్ట్రమంతటా విస్తరింపజేయటానికి.. ఐటీ సంస్థలు(IT Companies) కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. స్కిల్ యూనివర్సిటూ కూడా ఏర్పాటు చేసి పరిశ్రమ అవసరాలు తీరుస్తామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. ఇప్పటికే ఏఐ రంగం.. విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. అయితే భవిష్యత్తులో దీనివల్ల చాలా మంది ఉద్యోగాలు పోతాయని పలువురు హెచ్చరిస్తున్నారు. అలాగే మరిన్ని కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయని చెబుతున్నారు. ఏఐ స్కిల్స్ నెర్చుకునేవారికి ఉద్యోగ భద్రతపై ఎలాంటి ముప్పు ఉండదని.. ఇలాంటి వాళ్లకి అపారమైన అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
Also Read: తెలంగాణకు బీర్‌దెబ్బ..నీళ్ళు లేక తయారీ కష్టమంటున్న కంపెనీలు