IT Minster : వెన్నుపోటు పొడిచే వాళ్ళు వెళ్లడమే మంచిది.. వీరభద్రరావు రాజీనామాపై మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు

దాడి వీరభద్రరావు రాజీనామాపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. టికెట్ రాలేదని ఆయన పార్టీకి రాజీనామా చేశారని అన్నారు. దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు

New Update
IT Minster : వెన్నుపోటు పొడిచే వాళ్ళు వెళ్లడమే మంచిది.. వీరభద్రరావు రాజీనామాపై మంత్రి అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు

IT Minister Amaranth : దాడి వీరభద్రరావు(Dadi Veerabhadra Rao) వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రాజీనామా పై స్పందించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath). వైఎస్ఆర్సిపి(YSRCP) లో గెలిచే వారికి సీట్లు అని స్పష్టం చేశారు. ఈ విషయంలో కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదని అన్నారు. గడిచిన కొన్ని రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తల పేర్లు ప్రకటించారని అన్నారు. అప్పటి నుంచి చర్చ మొదలైయ్యాయని అన్నారు. సీటు ఇస్తేనే వుంటామని చెప్పే వ్యక్తులు పార్టీ లో వుండోద్దని స్పష్టం గా పార్టీ చెప్పిందని తెలిపారు.

ALSO READనా వల్లే తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం.. అందుకే నాకు ఆ కీలక స్థానం: షర్మిల సంచలన ప్రకటన

ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) కూడా చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల వేళ టికెట్లు రాని వ్యక్తులు పార్టీ కి దూరంగా ఉండటం వల్ల పార్టీ కి నష్టం లేదు అని అన్నారు. 175 సీట్లే ఏపిలో వున్నాయి..అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వ గలరని అన్నారు. దాడి వీరభద్ర కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. అప్పుడు తిరస్కరించారు... ఆ విషయంలో వారిదే ఆఖరి నిర్ణయం.. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని మంత్రి అమర్నాథ్ అన్నారు.

జనసేనలోకి దాడి వీరభద్రరావు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. విశాఖలో పార్టీకి చెందిన ముఖ్యనేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు పంపించారు. అయితే, తనకు టికెట్ రానుందనే దాడి విరభద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి దాడివీరభద్రరావు అనకాపల్లి టికెట్‌ను ఆశించారు. అయితే, టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీ మారాలని భావించారు. ఈ క్రమంలో తన కార్యకర్తలతో అనకాపల్లిలో కీలక సమావేశం నిర్వహించారు. తన నిర్ణయంపై కార్యకర్తలతో చర్చించారు. పార్టీలో తనకు గుర్తింపు లేదని వీరభద్రరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వైసీపీకి రాజీనామా చేశారు దాడి వీరభద్రరావు. తన రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డిలకు కూడా పంపారు. కాగా, విశాఖ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డికి మాత్రం ఆయన తన రాజీనామా లేఖను పంపలేదు.

ALSO READ: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ప్రజాపాలన దరఖాస్తులకు పొడిగింపు ఉండదు.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

వైసీపీని వీడిని దారి వీరభద్రరావు.. త్వరలోనే జనసేన పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పవన్ కల్యాణ్‌ను కలిశారు వీరభద్రం. ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో.. ఆ పార్టీలో చేరిక దాదాపు కన్ఫామ్ అని అంటున్నారు వీరభద్రం అనుచరులు. ఇక పవన్ సైతం వీరభద్రం రాకను స్వాగతిస్తున్నారట. ఆయన వస్తే పార్టీకి మరింత బలం చేకూరుతుందని విశ్వసిస్తున్నారట జనసేనాని.

Advertisment
Advertisment
తాజా కథనాలు