IT Jobs: ఐటీ కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే..

ఇప్పటికే ఐటీ కంపెనీలు.. ఖర్చులు తగ్గించుకోవడం కోసం తమ ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తుంది. అలాగే కంపెనీ మారాలనుకునే ఉద్యోగులకు కూడా మిగతా కంపెనీలు 18-22 శాతం వరకే హైక్‌లు ఇస్తున్నాయి.

New Update
IT Jobs: ఐటీ  కంపెనీలు మారుతున్నారా.. హైక్‌లు ఇంతే..

IT Salary Hikes: చదువు అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో చాలామంది ఐటీ ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. కొవిడ్ వచ్చిన తర్వాత ఐటీ రంగానికి మరింత గిరాకీ పెరిగిపోయింది. కానీ ఈమధ్య కొత్త ప్రాజెక్టులు తగ్గిపోతున్నాయి. చాలావరకు టెక్ కంపెనీలు ఆదాయాన్ని తగ్గించుకునేందుకు చాలామందిని ఉద్యోగంలో నుంచి తీసేశాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ - రష్యా యుద్ధం పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ఐటీ రంగానికి ప్రస్తుతం గొడ్డలి పెట్టుగా మారాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. భయాలు మరింత ఎక్కువయ్యాయి. వీటి ఫలితంగా ఉద్యోగాల మార్కెట్లో నియామకాలు అనే వార్తల కన్నా తొలగింపులే ఎక్కువగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా, అమెజాన్‌ వంటి పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకూ వ్యయ నియంత్రణ పేరిట అధిక వేతనాలన్న నిపుణులను తగ్గించుకుంటున్నాయి. దీనివల్ల ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే ఇతర కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఐటీ రంగం అంతటా కూడా కాస్ట్‌ కటింగ్‌ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనివల్ల కొత్తగా చేర్చుకునే వారికి ఇంతకుముందు భారీగా జీతాలు పెంచేసి ఉద్యోగాల్లో నియమించుకునే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇక కంపెనీ మారాలనుకునే వారికి పాత జీతంపై 18-22 శాతం మాత్రమే పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

Also read: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి కృత్రిమ వర్షం

ఇక ఐటీ ఉద్యోగాలు మారాలనుకునే వాళ్లకి జీతాల పెంపు గత ఆర్థిక ఏడాదితో పోల్చిచూస్తే.. దాదాపు సగానికి పడిపోయాయి. ఇంతకుముందు కంపెనీలో ఉన్న జీతంతో పోలిస్తే కేవలం 18-20 శాతం పెంపుతో ఉద్యోగంలో చేర్చుకుంటున్నారు. అయితే గతంలో అభ్యర్థులకు కనిష్ఠంగా 40 శాతం.. అలాగే గరిష్ఠంగా 100-120 శాతం వరకు వేతనం పెంచాలని డిమాండ్‌ చేసేవారని నివేదికలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ డిమాండ్‌ 35-40 శాతం వరకు పడిపోయినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు 2022లో ఫుల్‌స్టాక్ ఇంజినీర్లకు ఏటా రూ.15లక్షలు-రూ.32 లక్షల వరకు వేతనం ఉండేది. అయితే ఈఏడాది సగటున 8-16 శాతం తగ్గించి ఏటా రూ.12లక్షలు-రూ.28 లక్షలకు ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు.

Advertisment
తాజా కథనాలు