ISRO : 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు

2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు.

New Update
ISRO : 2040 నాటికి జాబిల్లి పైకి భారతీయుడు.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు

ISRO : సరికొత్త ప్రయోగాలతో సంచలనం సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రోజురోజుకూ దూసుకుపోతోంది. చంద్రయాన్‌-3(Chandrayan-3) సక్సెక్ కావడం, అలాగే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం కూడా విజయవంతం కావడంతో జోష్‌లో ఉన్న ఇస్రో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. 2040 నాటికి చంద్రునిపై తొలిసారిగా భారత వ్యోమగామిని దింపుతామని వెల్లడించారు. రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామి అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. అయితే వీళ్లందరూ కూడా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని పేర్కొన్నారు.

Also Read: మంత్రి కోమటిరెడ్డికి అనారోగ్యం.. యశోద ఆసుపత్రిలో చేరిక!

అలాగే గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా కూడా అంతరిక్ష అన్వేషణలో తదుపరి అంకాన్ని ఇస్రో చేపట్టనుందని చెప్పారు. దీనికింద ఇద్దరు లేదా ముగ్గురు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపుతామని తెలిపారు. మూడు రోజుల తర్వాత వారు భూమిపైకి తిరిగొస్తారని తెలిపారు. అయితే వీళ్లు ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. ఇక 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్రధాని మోదీ నిర్దేశించినట్లు చెప్పారు. అలాగే శుక్రుడి కక్ష్యలోని ఉపగ్రహాన్ని, అంగరకుడిపై ల్యాండర్‌ను ప్రయోగించాలని సూచించినట్లు వెల్లడించారు.

Also Read: తొలి విజయంతోనే సీఎం.. భజన్‎లాల్ కెరీర్‎లో ఆసక్తికర విశేషాలు

Advertisment
తాజా కథనాలు