ISRO : SSLV-D3 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ! ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది.ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. By Bhavana 16 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి SSLV-D3 : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో (ISRO) కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది. అలాగే EOS-08 మిషన్‌గా కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం విపత్తుల గురించి హెచ్చరికలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇది శాటిలైట్ టెక్నాలజీలో ఇస్రో సాధిస్తున్న పురోగతిని హైలైట్ చేస్తుంది. దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఇస్రో రాకెట్ ప్రయోగానికి రెడీ అయ్యింది. చెన్నైకి తూర్పున 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి చెందిన అంతరిక్ష నౌక మరోసారి సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకని ఉపగ్రహం నమూనాకు పూజలు నిర్వహించిన సైంటిస్టులు. ప్రయోగం వందశాతం విజయవంతం అవుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. Also Read: అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు! #tirumala #sslvd #sriharikota #isro మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి